ఆ దేశవాసులను కలవరపెట్టిన ‘39’ నెంబర్
దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ కారు కొనుగోలు చేయడమే కాకుండా, ఆ కారుకు తగ్గ ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవడం కొందరు స్టేటస్‌గా భావిస్తే, ఇంకొందరు ఆ సంఖ్య వల్ల తమకు అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. మరికొందరు సెంటిమెంట్ కోసం లక్కీ నెంబర్స్ కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు కారు కంటే ఆ కార్ నెంబర్‌కే ఎక్కువ ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల ఆర్టీఏకు బోలెడు ఆదాయం సమకూరుతుంది. అయితే అఫ్ఘానిస్థాన్ దేశ వాసులు మాత్రం […]
దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ కారు కొనుగోలు చేయడమే కాకుండా, ఆ కారుకు తగ్గ ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవడం కొందరు స్టేటస్‌గా భావిస్తే, ఇంకొందరు ఆ సంఖ్య వల్ల తమకు అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. మరికొందరు సెంటిమెంట్ కోసం లక్కీ నెంబర్స్ కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు కారు కంటే ఆ కార్ నెంబర్‌కే ఎక్కువ ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల ఆర్టీఏకు బోలెడు ఆదాయం సమకూరుతుంది. అయితే అఫ్ఘానిస్థాన్ దేశ వాసులు మాత్రం ఇందుకు భిన్నంగా 39 నెంబర్ తమకు ఇవ్వొద్దంటూ ఆర్టీఏ ఆఫీసర్లను వేడుకుంటున్నారు. అందుకు లక్షల రూపాయల లంచాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దేశ పౌరులను ఈ నెంబర్ కలవరపెడుతుండటంతో, ఆర్టీఏ ఆఫీసర్లు ఆ నెంబర్‌ను తొలగించాలనే నిర్ణయానికి వచ్చేశారు. అసలు వాళ్లు ఆ నెంబర్ ఎందుకు వద్దంటున్నారు?
అప్ఘాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న హెరట్ అనే సిటీలో వ్యభిచార గృహాలను నిర్వహించే ఓ వ్యక్తికి 39 అనే నెంబర్ అదృష్ట సంఖ్య కాగా, ఆ సంఖ్యనే తన కార్ నెంబర్లకు ఉపయోగించుకునేవాడు. దాంతో అతడిని అందరూ ‘39’ గా పిలిచేవారు. ఆ నెంబర్ గల కారులో ఎవరైనా ప్రయాణిస్తే, ఆకతాయిలు ఆ కారు వెంటపడుతూ వ్యంగ్యమాటలతో దూషించడం, అవమానించడం చేసేవాళ్లు. ఈ కారణంగా హెరట్ నగరంలోని ప్రజలు ఆ నెంబర్ ఉన్న కారులో వెళ్లడానికే జంకేవారు. ఈ విషయం కాస్త దేశమంతా వ్యాపించి, ఆ నెంబర్ కార్లలో ప్రయాణిస్తున్నారంటే వారిని వ్యభిచారులుగా అనుకోవడం మొదలైంది. దాంతో ‘39’ సంఖ్య అప్ఘాన్ దేశవాసులకు ఓ పీడకలలా మారింది. ఆ భయంతో 39 నెంబర్ ఉన్న ఫోన్ నెంబర్లు కూడా వాడటం మానేశారు. ఈ క్రమంలో ‘39’ నెంబర్ ఇవ్వొద్దని ఆర్టీఏ అధికారులకు వినతులు రావడం, ఒకవేళ ఒప్పుకోకపోతే ఆ సంఖ్య తమకు కేటాయించకుండా ఉండటానికి అధికారులకు లంచాలు(300 డాలర్లుకు పైగా) కూడా ఇచ్చేవాళ్లు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ‘39’ సంఖ్యను కలిగి ఉన్న లైసెన్స్ ప్లేట్లను రిటైర్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, ప్రభుత్వం వెహికల్ రిజిస్ట్రేషన్‌లో ఆ సిరీస్‌ను తొలగించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.