మళ్లీ తాలిబన్ల చేతికి అఫ్ఘనిస్తాన్..?

న్యూఢిల్లీ: యుద్ధాలతో ధ్వంసమైన అప్ఘనిస్తాన్ మళ్లీ తాలిబన్ల చేతికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు ఆశించిన ఫలితాలివ్వకపోవడం, మరోవైపు అమెరికా ట్రూపులు వెనుదిరిగి వెళ్తుండటంతో తాలిబన్లు బలపడుతున్నారు. అమెరికా బలగాలు స్వదేశానికి వెళ్తుండగా ప్రభుత్వ సైన్యాలపై దాడులు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే 85శాతం దేశం తమ అధీనంలోకి వచ్చిందని తాలిబన్ నేతలు ప్రకటించారు. ఇరాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న ఇస్లాం ఖాలా పట్టణాన్నీ ఆక్రమించుకున్నట్టు తెలిపారు. దీంతో తజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, పాకిస్తాన్ సహా చైనా […]

Update: 2021-07-09 08:46 GMT

న్యూఢిల్లీ: యుద్ధాలతో ధ్వంసమైన అప్ఘనిస్తాన్ మళ్లీ తాలిబన్ల చేతికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు ఆశించిన ఫలితాలివ్వకపోవడం, మరోవైపు అమెరికా ట్రూపులు వెనుదిరిగి వెళ్తుండటంతో తాలిబన్లు బలపడుతున్నారు. అమెరికా బలగాలు స్వదేశానికి వెళ్తుండగా ప్రభుత్వ సైన్యాలపై దాడులు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే 85శాతం దేశం తమ అధీనంలోకి వచ్చిందని తాలిబన్ నేతలు ప్రకటించారు. ఇరాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న ఇస్లాం ఖాలా పట్టణాన్నీ ఆక్రమించుకున్నట్టు తెలిపారు. దీంతో తజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, పాకిస్తాన్ సహా చైనా సరిహద్దు భూభాగం వరకు తాలిబన్ల అధీనంలోకి వెళ్లినట్టయింది. అఫ్ఘాన్‌లోని మొత్తం 398 జిల్లాల్లో 250 జిల్లాలు తమ అధీనంలోనే ఉన్నాయని తాలిబన్ ప్రతినిధులు మాస్కోలో ఓ మీడియా సంస్థకు తెలిపారు.

ఖాలా బార్డర్ క్రాసింగ్ వరకూ తమ పరిధి విస్తరించిందని వివరించారు. ఇక్కడి నుంచి ప్రభుత్వాధికారులు ఇప్పటికే తరలివెళ్లారు. కానీ, ఈ ఏరియాలో తాలిబన్లతో ఇంకా పోరాటం జరుపుతున్నామని అధికారవర్గాలు తెలిపాయి. అమెరికా బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని సమర్థిస్తూ దేశాధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటించిన తర్వాత తాలిబన్ల ప్రకటన వెలువడటం గమనార్హం. 20ఏళ్లుగా జరుగుతున్న ప్రక్రియ ఆగస్టు 31 నాటికి ముగుస్తుందని, తమ బలగాలు స్వదేశానికి వచ్చి చేరుతాయని వివరించారు. మరో అమెరికా తరాన్ని అఫ్ఘాన్‌లో యుద్ధానికి ఎట్టిపరిస్థితుల్లో పంపబోమని స్పష్టం చేశారు. అఫ్ఘనిస్తాన్‌ను ఉమ్మడిగా ప్రభుత్వం పరిపాలించడం సాధ్యపడకపోవచ్చని అభిప్రాయపడటం గమనార్హం. బైడెన్ ప్రకటనను తాలిబన్లు స్వాగతించారు.

Tags:    

Similar News