తాలిబన్లకు క్రికెట్ అంటే ఇష్టమా!

దిశ, స్పోర్ట్స్: తాలిబన్లకు క్రికెట్ అంటే ఇష్టమేనని, ఆటకు వాళ్లు మద్దతిస్తారని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవో హమిద్ షిన్వారీ వెల్లడించారు. మంగళవారం నుంచి తమ దేశంలో క్రికెట్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అంతేకాకుండా, యూఏఈలో జరగనున్న ఐపీఎల్ రెండో ఫేజ్‌లో రషీద్ ఖాన్ తప్పకుండా ఆడతాడని దీమా వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఆదివారం నుంచి పూర్తిగా తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌ […]

Update: 2021-08-16 09:53 GMT

దిశ, స్పోర్ట్స్: తాలిబన్లకు క్రికెట్ అంటే ఇష్టమేనని, ఆటకు వాళ్లు మద్దతిస్తారని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవో హమిద్ షిన్వారీ వెల్లడించారు. మంగళవారం నుంచి తమ దేశంలో క్రికెట్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అంతేకాకుండా, యూఏఈలో జరగనున్న ఐపీఎల్ రెండో ఫేజ్‌లో రషీద్ ఖాన్ తప్పకుండా ఆడతాడని దీమా వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఆదివారం నుంచి పూర్తిగా తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌ భవితవ్యం పైనా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలో హమిద్ షిన్వారీ స్పందిస్తూ.. ఇక్కడి తీవ్రమైన రాజకీయ పరిణామాలతో ఆఫ్ఘాన్ క్రికెట్‌ ప్రమాదంలో పడబోదని ఇతర దేశాల క్రికెట్ బోర్డులకు హామీనిచ్చారు. తాలిబన్లకు క్రికెట్‌పై మమకారం ఉందని, వారు ఆటకు పూర్తి మద్దతిస్తారని తెలిపారు. ఆఫ్ఘాన్ క్రికెటర్లు, వారి కుటుంబాలు క్షేమంగానే ఉన్నాయని చెప్పారు. కాగా, వచ్చే నెల 1నుంచి పాకిస్తాన్‌తో కొలంబోలో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది.

కదులుతున్న విమానం ఎక్కుతున్న ఆఫ్ఘాన్ ప్రజలు.. వీడియో వైరల్

Tags:    

Similar News