అఫ్గాన్ క్రికెటర్‌కు యాక్సిడెంట్

దిశ, స్పోర్ట్స్: అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ అఫ్సర్ జజాయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కారులో వెళ్తుండగా జజాయ్ వాహనం ప్రమాదానికి గురైందని, కారు పూర్తిగా ధ్వంసమయినా జజాయ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడని అఫ్గాన్ జట్టు మాజీ మీడియా మేనేజర్ ఇబ్రహీం మోమంద్ ట్విట్టర్‌లో తెలిపారు. కాగా, జజాయ్ తలకు గాయం కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. భారీ ప్రమాదం నుంచి క్రికెటర్ బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Update: 2020-06-21 07:20 GMT

Tags:    

Similar News