హైదరాబాద్‌లో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించిన డాటా కన్సల్టెన్సీ సంస్థ అఫైన్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), డాటా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కన్సల్టెన్సీ సంస్థ అఫైన్ హైదరాబాద్‌లో తన నూతన బ్రాంచ్‌ను బుధవారం ప్రారంభించింది. రాబోయే ఆరు నెలల కాలంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో విస్తరించే ప్రణాళికలో భాగంగా సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందని, దీనిద్వారా వచ్చే ఏడాది చివరి నాటికి 1,000 మంది ఉద్యోగులను కలిగి ఉంటామని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర చివరిలోపు 200 మంది ఉద్యోగులను, 2022లోపు మరో 400 మందిని తీసుకోవాలని […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), డాటా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కన్సల్టెన్సీ సంస్థ అఫైన్ హైదరాబాద్‌లో తన నూతన బ్రాంచ్‌ను బుధవారం ప్రారంభించింది. రాబోయే ఆరు నెలల కాలంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో విస్తరించే ప్రణాళికలో భాగంగా సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందని, దీనిద్వారా వచ్చే ఏడాది చివరి నాటికి 1,000 మంది ఉద్యోగులను కలిగి ఉంటామని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర చివరిలోపు 200 మంది ఉద్యోగులను, 2022లోపు మరో 400 మందిని తీసుకోవాలని భావిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ ఇంజనీరింగ్ నైపుణ్యాలను కలిగిన వారిని నియమించుకోనున్నట్టు అఫైన్ సహ-వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మానస్ అగర్వాల్ అన్నారు. నాలుగో పారిశ్రమైక విప్లవం(ఇండస్ట్రీ 4.0)లో హైదరాబాద్ కీలకమైనది. అన్ని టెక్ కంపెనీలకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలుస్తోంది. వృద్ధితో పాటు అభివృద్ధికి అనేక అవకాశాలను కలిగి ఉంది. ప్రస్తుతం ఆర్అండ్‌డీలోని తమ ఇంజనీర్లు వినియోగదారుల కోసం అత్యంత వినూత్మైన ఉత్పత్తులను, పరిష్కారాలపై పనిచేస్తున్నారని మానస్ అగర్వాల్ వివరించారు.