దైన్యానికి ఆ పత్రిక అద్దం పట్టింది!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మమమ్మారి కారణంగా చైనా కంటే అమెరికానే అత్యంత ఎక్కువగా నష్టపోయింది. ఆర్థికంగా కుదేలవడమే కాకుండా ప్రాణ నష్టం కూడా భారీగానే జరిగింది. కరోనా కారణంగా ఆసుపత్రుల్లో, ఇండ్లలో వేలాదిమంది చనిపోయారు. తమ ఆప్తులను కోల్పోవడమే కాదు. కనీసం వారి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేక అనేకమంది వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఒక పత్రికలో ఏకంగా 15 పేజీల శ్రద్ధాంజలి ప్రకటనలు వచ్చాయి. అమెరికాలో ప్రముఖ దినపత్రిక ‘బోస్టన్ గ్లోబ్’లో బంధువులు, […]

Update: 2020-04-20 07:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మమమ్మారి కారణంగా చైనా కంటే అమెరికానే అత్యంత ఎక్కువగా నష్టపోయింది. ఆర్థికంగా కుదేలవడమే కాకుండా ప్రాణ నష్టం కూడా భారీగానే జరిగింది. కరోనా కారణంగా ఆసుపత్రుల్లో, ఇండ్లలో వేలాదిమంది చనిపోయారు. తమ ఆప్తులను కోల్పోవడమే కాదు. కనీసం వారి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేక అనేకమంది వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఒక పత్రికలో ఏకంగా 15 పేజీల శ్రద్ధాంజలి ప్రకటనలు వచ్చాయి. అమెరికాలో ప్రముఖ దినపత్రిక ‘బోస్టన్ గ్లోబ్’లో బంధువులు, మిత్రులు ఇచ్చిన శ్రద్ధాంజలి ప్రకటనలతో 15 పేజీలు నిండిపోయాయంటే అక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. మసాచూసెట్స్ ప్రాంతంలో 38 వేలకు పైగా కరోనా కేసులు నమోదవగా.. 1,706 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు డోర్చెస్టర్ నగరంలో కూడా కరోనా తీవ్రత అధికంగానే ఉంది. వీటన్నింటికీ బోస్టన్ గ్లోబ్ పత్రికలోని ప్రకటనలే నిదర్శనమంటూ దాని ఫొటోలు తీసి నెటిజన్లు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. గత నెలలో ఇటలీలోని ప్రముఖ పత్రికల్లో కూడా ఇలాగే భారీగా శ్రద్ధాంజలి ప్రకటనలు ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 7.70 లక్షలకు చేరుకోగా మృతుల సంఖ్య 41 వేలు దాటింది.

tags: America, Corona Virus, Boston Globe Magazine, Auditory Ads

Tags:    

Similar News