ఆర్సెలర్ మిట్టల్ సంస్థ సీఈవోగా ఆదిత్య మిట్టల్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే దిగ్గజ స్టీల్ ఉత్పత్తి సంస్థ ఆర్సెలర్ మిట్టల్ కొత్త ఛైర్మన్, సీఈఓగా ఆదిత్య మిట్టల్ ఎంపికయ్యారు. తండ్రి లక్ష్మీ మిట్టల్ నుంచి సంస్థ వ్యవస్థాపక బాధ్యతలను ఆయన అందుకున్నారు. ఆర్సెలర్ మిట్టల్ సంస్థను అంతర్జాతీయ సంస్థగా మార్చడంలో కీలకంగా ఉన్న లక్ష్మీ మిట్టల్ ఇకమీదట కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఆర్సెలర్ మిట్టల్ సంస్థ సుమారు 60 దేశాల్లో ఉక్కు, మైనింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 17 దేశాల్లో ఉక్కు నిర్మాణ రంగంలో ఉంది. […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే దిగ్గజ స్టీల్ ఉత్పత్తి సంస్థ ఆర్సెలర్ మిట్టల్ కొత్త ఛైర్మన్, సీఈఓగా ఆదిత్య మిట్టల్ ఎంపికయ్యారు. తండ్రి లక్ష్మీ మిట్టల్ నుంచి సంస్థ వ్యవస్థాపక బాధ్యతలను ఆయన అందుకున్నారు. ఆర్సెలర్ మిట్టల్ సంస్థను అంతర్జాతీయ సంస్థగా మార్చడంలో కీలకంగా ఉన్న లక్ష్మీ మిట్టల్ ఇకమీదట కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఆర్సెలర్ మిట్టల్ సంస్థ సుమారు 60 దేశాల్లో ఉక్కు, మైనింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 17 దేశాల్లో ఉక్కు నిర్మాణ రంగంలో ఉంది. 2006లో ఆర్సెలర్ సంస్థతో మిట్టల్ స్టీల్ విలీనమైన సంగతి తెలిసిందే.
గతేడాది కరోనా వ్యాప్తి అనంతరం ఆ ప్రభావం నుంచి సంస్థను కాపాడటంలో ఆదియ మిట్టల్ కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆదిత్య మిట్టల్ ఆర్సెలర్ మిట్టల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉన్నారు. సంస్థ సీఈఓగా ఆదిత్యను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు కంపెనీ బోర్డు డైరెక్టర్లు ప్రకటించారు. 1997లో ఆర్సెలర్ మిట్టల్‌లో చేరిన ఆదిత్య మిట్టల్, అంతకుముందు క్రెడిట్ సుజీ అనే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థలో పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉన్నారు.