రికార్డు సృష్టించిన అదితి అశోక్

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా గోల్ఫర్‌గా అదితి అశోక్ రికార్డు సృష్టించింది. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 45వ స్థానంలో నిలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ట్వీట్ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందుకు గాను సాయ్ అభినందనలు తెలిపింది. ఈ అవకాశం వచ్చినందుకు తాను చాలా గర్విస్తున్నట్లు అదితి అశోక్ చెప్పింది. ‘రియో ఒలింపిక్స్ నిన్న గాక మొన్న జరిగినట్లు అనిపిస్తున్నది. […]

Update: 2021-06-29 11:15 GMT

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా గోల్ఫర్‌గా అదితి అశోక్ రికార్డు సృష్టించింది. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 45వ స్థానంలో నిలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ట్వీట్ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందుకు గాను సాయ్ అభినందనలు తెలిపింది. ఈ అవకాశం వచ్చినందుకు తాను చాలా గర్విస్తున్నట్లు అదితి అశోక్ చెప్పింది. ‘రియో ఒలింపిక్స్ నిన్న గాక మొన్న జరిగినట్లు అనిపిస్తున్నది. ఇండియా తరపున ఒలింపిక్స్‌లో రెండో సారి పాల్గొనడం చాలా ఆసక్తిగా ఉన్నది. నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది’ అని అదితి అశోక్ ట్వీట్ చేసింది. ఇప్పటికే అనిర్బన్ లాహిరి పురుషుల విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News