కరోనాతో ఆదిలాబాద్ ఎస్‌ఐ మృతి
దిశ, ఆదిలాబాద్: కరోనాతో ఆదిలాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ మెస్రం చంద్రభాను మృతి చెందారు. పక్షం రోజుల క్రితం కొవిడ్ సోకగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. బజార్‌హత్నూర్ మండలం జాతర్ల గ్రామానికి చెందిన చంద్రభాను 1985లో కానిస్టేబుల్‌గా చేరారు.1987లో ఆలంపూర్‌లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో త్రుటిలో తప్పించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు ముఖ్యమంత్రి శౌర్య పతకం అందించారు. 2018లో ఎస్సైగా పదోన్నతి పొంది స్పెషల్ బ్రాంచ్‌లో […]
దిశ, ఆదిలాబాద్: కరోనాతో ఆదిలాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ మెస్రం చంద్రభాను మృతి చెందారు. పక్షం రోజుల క్రితం కొవిడ్ సోకగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. బజార్‌హత్నూర్ మండలం జాతర్ల గ్రామానికి చెందిన చంద్రభాను 1985లో కానిస్టేబుల్‌గా చేరారు.1987లో ఆలంపూర్‌లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో త్రుటిలో తప్పించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు ముఖ్యమంత్రి శౌర్య పతకం అందించారు. 2018లో ఎస్సైగా పదోన్నతి పొంది స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లుగా ఆదివాసీల సమస్యలను జిల్లా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేసేవారు. చంద్రభాను మృతి పట్ల ఎస్పీ విష్ణు వారియర్ సంతాపం తెలిపారు.