టెంపరేచర్ వార్నింగ్ జోన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్
దిశ, ఆదిలాబాద్: తీవ్రమైన ఎండలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్నింగ్ జోన్‌లో చేరింది. గత మూడు రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుగా నమోదువుతున్నాయి. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ అధికారులు ఆదిలాబాద్ జిల్లాను వార్నింగ్ జోన్‌గా ప్రకటించారు. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలను వార్నింగ్ జోన్‌గా, 40 నుంచి 45 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాలను అలర్ట్ జోన్‌గా, 40 డిగ్రీల లోపు ఉండే ప్రాంతాలను వాచింగ్ […]
దిశ, ఆదిలాబాద్: తీవ్రమైన ఎండలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్నింగ్ జోన్‌లో చేరింది. గత మూడు రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుగా నమోదువుతున్నాయి. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ అధికారులు ఆదిలాబాద్ జిల్లాను వార్నింగ్ జోన్‌గా ప్రకటించారు. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలను వార్నింగ్ జోన్‌గా, 40 నుంచి 45 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాలను అలర్ట్ జోన్‌గా, 40 డిగ్రీల లోపు ఉండే ప్రాంతాలను వాచింగ్ జోన్‌గా భావిస్తారని అధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను టెంపరేచర్ వార్నింగ్ జోన్‌గా నిర్ణయిస్తూ వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Tags: adilabad, warning zone, weather department, ts news