డైరెక్టర్ రాజమౌలికి బీజేపీ ఎంపీ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌలి కాంబినేషన్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల కొమురం భీం జయంతి సందర్భంగా విడుదల చేసిన టీజర్‌పై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూవీలో కొమురం భీం పాత్రను వక్రీకరించారని, వక్రీకరించడం అంటే మా మనోభావాలను దెబ్బతీయడమే అని మండిపడ్డారు. తాజాగా దీనిపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌలికి […]
దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌలి కాంబినేషన్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల కొమురం భీం జయంతి సందర్భంగా విడుదల చేసిన టీజర్‌పై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూవీలో కొమురం భీం పాత్రను వక్రీకరించారని, వక్రీకరించడం అంటే మా మనోభావాలను దెబ్బతీయడమే అని మండిపడ్డారు. తాజాగా దీనిపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌలికి వార్నింగ్ ఇచ్చారు.
చరిత్ర తెలియకుండా సినిమాలు తీస్తే ఎవరూ ఊరుకోరని… అదే తరహాలో సినిమా విడుదల చేస్తే… థియేటర్లు తగులబెట్టే పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించారు. కలెక్షన్ల కోసం తమ ఆదాధ్య దైవాన్ని కించపరిస్తే సహించబోమని… భీంను చంపిన వాళ్ల టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసీలను అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.