మన తప్పు.. ఎదుటివారి ప్రాణాలకు ముప్పు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచం స్తంభించింది. కోవిడ్ 19 మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ఎవరికి వారు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌లోనూ అదే పరిస్థితి నెలకొనగా…. లాక్ డౌన్ చాలా కష్టంగా ఉందనేది కొంత మంది అభిప్రాయం. కానీ మన కోసం.. మన చుట్టూ ఉన్న వారిని రక్షించుకోవడం కోసం తప్పకుండా లాక్ డౌన్ పాటించాల్సిందే. కాగా ఈ సమయాన్ని సినీ ప్రముఖులంతా తమ తమ స్టైల్లో ఎంజాయ్ చేస్తుంటే…. ‘ఎవరు’ సినిమాతో […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచం స్తంభించింది. కోవిడ్ 19 మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ఎవరికి వారు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌లోనూ అదే పరిస్థితి నెలకొనగా…. లాక్ డౌన్ చాలా కష్టంగా ఉందనేది కొంత మంది అభిప్రాయం. కానీ మన కోసం.. మన చుట్టూ ఉన్న వారిని రక్షించుకోవడం కోసం తప్పకుండా లాక్ డౌన్ పాటించాల్సిందే. కాగా ఈ సమయాన్ని సినీ ప్రముఖులంతా తమ తమ స్టైల్లో ఎంజాయ్ చేస్తుంటే…. ‘ఎవరు’ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టిన అడవి శేషు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నానని తెలిపారు.
‘మేజర్’ సినిమా షూటింగ్ జరుగుతుండగా లాక్ డౌన్ ప్రకటించారని… దీంతో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు శేషు. దీంతో బిజీ షెడ్యూల్ నుంచి ఒక్కసారిగా సెల్ఫ్ ఐసోలేషన్ అంటే మొదట్లో చాలా కష్టంగా అనిపించిందన్న శేషు …. పాత అలవాట్లు, వర్కౌట్స్ ద్వారా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశానని తెలిపారు. తద్వారా కొంత ఒత్తడి తగ్గిందన్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా కొత్త సినిమాలు చూడడం మొదలుపెట్టానని చెప్పారు. ఈ మధ్యే ‘పారాసైట్’ మూవీ చూశానని… ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సినిమా ఈ ఇయర్ బెస్ట్ పిక్చర్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఓల్డ్ ఫేవరేట్ మూవీ ‘గాడ్ ఫాదర్ ట్రయాలజీ’ మూవీ కూడా చూశానన్న ఆయన… నటనలో రిఫ్రెష్‌మెంట్ కోర్సు అవసరమైనప్పుడల్లా ఈ సినిమా చూస్తానని చెప్పారు. దర్శకులు మణిరత్నం సినిమాలు నటనలో గైడ్ లాంటివని ప్రశంసించారు.
లాక్ డౌన్ సమయంలో పుస్తకాలు కూడా చదువుతున్నానని… కానీ ఇలాంటి పుస్తకాలు చదవాలని బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ చెప్పడం నాకు ఇష్టం లేదన్నారు. భారత్‌లో ఒకప్పుడు బ్యాన్ చేసిన ‘ద హిందూస్ – ఆన్ ఆల్టర్నేటివ్ హిస్టరీ’ పుస్తకాన్ని చదువుతున్నానని తెలిపారు. దర్శకులు రాహుల్ పకలతో కలిసి గూఢచారి2 స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నట్లు తెలిపిన శేషు… త్వరలోనే స్క్రిప్ట్ పూర్తవుతుందన్నారు.
ఇన్ని పనులతో నన్ను నేను బిజీగా మలుచుకునేందుకు ప్రయత్నించినా… ఇలాంటి సమయంలో తల్లి, సోదరి దూరంగా ఉండడం బాధగా ఉందన్నారు. ప్రస్తుతం నాన్న, నేను ఇంట్లో ఉన్నామన్న ఆయన… క్లిష్టమైన పరిస్థితుల్లో ఆత్మీయులు దూరంగా ఉంటే బాధగా ఉందన్నారు. నిజానికి సామాజిక దూరాన్ని పాటించేందుకు ఎలాంటి ఒత్తిడి లేదని.. కానీ కొందరు యువకులు తమపై కరోనా ప్రభావం చూపే అవకాశం లేదని లైట్ తీసుకోవడాన్ని తప్పు పట్టారు. మనం చేసే తప్పువల్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వారికి కూడా కరోనా సంక్రమించే ప్రమాదం ఉందని … ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. చేతులు తరుచుగా శుభ్రంగా కడుగుతూ… సామాజిక దూరాన్ని పాటిస్తూ … బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Tags : Adavi Seshu, Self Isolation, Lock Down, Corona, CoronaVirus, Covid19