పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి అదానీ!
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయంగా పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్ పంపిణీ లాంటి విభాగాల్లో ఇప్పటికే వ్యాపారాలను నిర్వహిస్తున్న ప్రముఖ అదానీ గ్రూప్ సంస్థ తాజాగా పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. గ్రూప్ ప్రధాన వ్యాపార విభాగం అదానీ ఎంటర్‌ప్రైజెస్ యాజమాన్యంలో అనుబంధ సంస్థగా అదానీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(ఏపీఎల్)ను జులై 30న ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. వ్యాపార కార్యకలాపాలను ఇంకా ప్రారంభించని ఏపీఎల్ అధీకృత, మూలధన వాటా రూ. లక్ష అని అదానీ […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయంగా పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్ పంపిణీ లాంటి విభాగాల్లో ఇప్పటికే వ్యాపారాలను నిర్వహిస్తున్న ప్రముఖ అదానీ గ్రూప్ సంస్థ తాజాగా పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. గ్రూప్ ప్రధాన వ్యాపార విభాగం అదానీ ఎంటర్‌ప్రైజెస్ యాజమాన్యంలో అనుబంధ సంస్థగా అదానీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(ఏపీఎల్)ను జులై 30న ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది.
వ్యాపార కార్యకలాపాలను ఇంకా ప్రారంభించని ఏపీఎల్ అధీకృత, మూలధన వాటా రూ. లక్ష అని అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ వ్యాపార విభాగం రిఫైనరీలు, పెట్రోకెమికల్స్ కాంప్లెక్సులు, స్పెషాలిటీ కెమికల్ యూనిట్లు, హైడ్రోజన్, సంబంధిత కెమికల్ ప్లాంట్లు, ఇంకా ఇతర యూనిట్ల వ్యాపారాలను కొనసాగించనుంది. ప్రస్తుతం దేశీయంగా పెట్రోకెమికల్స్ వ్యాపారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. గడిచిన రెండు నెలల్లో అదానీ గ్రూప్ సంస్థ చేసిన రెండో కీలక ప్రకటన పెట్రోకెమికల్స్ విభాగంలోకి రావడం. ఇదివరకు జూన్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ సిమెంట్ వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్టు స్పష్టం చేసింది.