‘సోనూ’పై బుక్.. టైటిల్ ఏంటో తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ యాక్టర్ సోనూ సూద్ తెరపైన విలన్. కానీ, నిజజీవితంలో సూపర్ హీరో. కరోనా మహమ్మారి కాలంలో వలస కూలీల పాలిట ఆపద్బాంధవుడయ్యాడు. ఒక్క మెసేజ్ చేస్తే చాలు..వెంటనే ఆదుకునే భగవంతుడయ్యాడనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ప్రభుత్వాలు చేయలేని పనులను ఓ సెలెబ్రిటీ తన సాయశక్తుల చేశాడని ప్రజానీకం కొనియాడింది. విదేశాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులను, పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను […]

Update: 2020-11-12 13:43 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ యాక్టర్ సోనూ సూద్ తెరపైన విలన్. కానీ, నిజజీవితంలో సూపర్ హీరో. కరోనా మహమ్మారి కాలంలో వలస కూలీల పాలిట ఆపద్బాంధవుడయ్యాడు. ఒక్క మెసేజ్ చేస్తే చాలు..వెంటనే ఆదుకునే భగవంతుడయ్యాడనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ప్రభుత్వాలు చేయలేని పనులను ఓ సెలెబ్రిటీ తన సాయశక్తుల చేశాడని ప్రజానీకం కొనియాడింది.

విదేశాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులను, పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తన సొంత ఖర్చుతో విమానాలు, రైళ్లు, బస్సులు ఏర్పాటు చేయించి స్వరాష్ట్రాలకు పంపించారు. ‘ఘ‌ర్ బేజో’ కార్య‌క్ర‌మాన్ని మాన‌వ‌తా మిష‌న్‌లాగా చేప‌ట్టారు. ఈ నేపథ్యంలో సోనూ ఆత్మకథను రచిస్తున్నట్లు, అందులో సోనూ అనుభవాలు వివరంగా ఉంటాయని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా పేర్కొంది. తాజాగా ఆ పుస్తకానికి ‘‘ఐ యామ్ నో మెస్సీయ’’ (I Am No Messiah ) అని పేరు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఐ యామ్ నో మెస్సీయ అంటే తెలుగులో నేనేం ఆపద్బాంధవుడిని కాను అని అర్థం. ఈ పుస్తకం డిసెంబ‌ర్‌లో రిలీజ్ కానున్నట్లు సోనూసూద్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

సోనూ ఆత్మకథపై వస్తున్న బుక్ టైటిల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మెస్సీయ అంటే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి అని అర్థం. ప్రజలు చాలా దయతో ఉన్నారని, తనకు ప్రేమగా మెస్సీయ అని పేరు పెట్టారని, కానీ, తాను మెస్సీయని కాదని సోనూ చెబుతున్నారు. అయితే, దానిని నెటిజనాలు ఒప్పుకోవడం లేదు. లాక్‌డౌన్‌లో సోనూ సేవలకు సరి ఎవరూ లేరని ఆయన ‘వలసదారుల మెస్సీయ’ అని పొగుడుతున్నారు.

వేలాదిమంది వ‌ల‌స కార్మికుల వ‌లె త‌నకు ఓ క‌థ ఉందని సోనూ చెప్పారు. మోగా నుంచి ముంబైకి వెళ్లిన సోనూ అసాధారణ అనుభవాలను బుక్‌లో పొందుపరుస్తున్నట్లు ప్రముఖ జర్నలిస్ట్, రచయిత మీనా కె. అయ్యర్ తెలిపారు. నిజాయితీ, స్ఫూర్తిదాయకమైన వ్య‌క్తి సోను సూద్ అని చెప్పారు.

Tags:    

Similar News