హెచ్ ఆర్సీలో సినీ నటుడు శివ బాలాజీ ఫిర్యాదు

దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఆన్ లైన్ తరగతుల పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న దోపిడిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో సినీ నటుడు శివ బాలాజీ సోమవారం ఫిర్యాదు చేశారు. ఓ వైపు వసతులు కల్పించకుండానే ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తూ, మరోవైపు ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడిని పెంచుతున్నాయని అన్నారు. హెచ్ఆర్సీలో ఫిర్యాదు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… నగరంలోని మణికొండ మౌంట్ లీటేరా […]

Update: 2020-09-14 10:25 GMT

దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఆన్ లైన్ తరగతుల పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న దోపిడిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో సినీ నటుడు శివ బాలాజీ సోమవారం ఫిర్యాదు చేశారు. ఓ వైపు వసతులు కల్పించకుండానే ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తూ, మరోవైపు ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడిని పెంచుతున్నాయని అన్నారు. హెచ్ఆర్సీలో ఫిర్యాదు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… నగరంలోని మణికొండ మౌంట్ లీటేరా జీ పాఠశాలలో తమ పిల్లలు చదువుతున్నారని తెలిపారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తమ పిల్లలను యాజమాన్యం ఆన్ లైన్ క్లాసెస్ నుంచి తొలగించారని తెలిపారు. ఇది తన ఒక్కరి పరిస్థితి కాదని అన్నారు. అన్ని పాఠశాలల్లోనూ ఇదే విధంగా యాజమన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. పెంచిన ఫీజులను తగ్గించాలని జీ పాఠశాలను కోరినట్టు తెలిపారు. కాగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమ పిల్లలను తొలగించారని శివ బాలాజీ తెలిపారు. ఇదే తరహాలో అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల పాఠశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరుపై విచారణ జరిపి చర్యలు
తీసుకోవాలని కమిషన్‌ను ఆయన కోరారు.

Tags:    

Similar News