కరోనా జీవన గుణపాఠం నేర్పింది : రాజేంద్రప్రసాద్

దిశ, ఏపీబ్యూరో : ప్రముఖ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్​ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2020 సంవత్సరం మనకందరికీ ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. జీవితమంటే ఏంటో.. ఎలా బతకాలో స్వామి కరోనాతో తెలియజేసినట్లు పేర్కొన్నారు. పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం ప్రజల అదృష్టమని చెప్పారు. ఇంకా ఉదయం వీఐపీ దర్శనంలో తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు మాజీ ఎంపీ […]

Update: 2020-12-30 11:04 GMT

దిశ, ఏపీబ్యూరో : ప్రముఖ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్​ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2020 సంవత్సరం మనకందరికీ ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. జీవితమంటే ఏంటో.. ఎలా బతకాలో స్వామి కరోనాతో తెలియజేసినట్లు పేర్కొన్నారు. పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం ప్రజల అదృష్టమని చెప్పారు.

ఇంకా ఉదయం వీఐపీ దర్శనంలో తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, జాతీయ పిల్లల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్ జీ ఆనంద్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, వైఎస్సార్​టీయూసీ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి దేవదేవుడ్ని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వీరిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Tags:    

Similar News