నా కంటే ముందే వారిని వేదికమీదకు పిలవండి.. మంత్రి సంచలన నిర్ణయం

దిశ, జల్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌లోని పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్‌లో బుధవారం టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, మంత్రి సమక్షంలో ప్రారంభమైన ఈ సమావేశం ఉద్రిక్తంగా మారింది. ప్రారంభమైన ఐదు నిముషాల్లోలనే విమర్శల పర్వం ఉవ్వెత్తున ఎగిసింది. ఉద్యమకారులను చిన్నచూపు చూస్తున్నారని, పార్టీ కమిటీల్లో కూడా పదవులు ఇవ్వడం లేదని, సమావేశాల్లో కనీసం […]

Update: 2021-10-27 04:42 GMT

దిశ, జల్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌లోని పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్‌లో బుధవారం టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, మంత్రి సమక్షంలో ప్రారంభమైన ఈ సమావేశం ఉద్రిక్తంగా మారింది. ప్రారంభమైన ఐదు నిముషాల్లోలనే విమర్శల పర్వం ఉవ్వెత్తున ఎగిసింది. ఉద్యమకారులను చిన్నచూపు చూస్తున్నారని, పార్టీ కమిటీల్లో కూడా పదవులు ఇవ్వడం లేదని, సమావేశాల్లో కనీసం వేదిక మీదకు పిలవడంలేదని మహేశ్వరం నియోజకవర్గ తెలంగాణ ఉద్యమ కారులు వేదిక ముందు కింద కూర్చొని నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు పట్టించుకోవడం లేదని హన్మంత్, వెంకట్ రామ్ రెడ్డి, సంతోష్ ముదిరాజ్‌లు ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తీగల కృష్ణారెడ్డి కూడా పట్టించుకోలేదని, మీ హయాంలో కూడా ఉద్యమ కారులను కించపరిస్తే ఎలా అని మంత్రి సబితాఇంద్రారెడ్డిని నిలదీశారు.

అంతకుముందు తెలంగాణ ఉద్యమ కారులతో పాటు కార్పొరేటర్‌లను కూడా వేదికపైకి పిలవకపోవడంతో సభకు పిలిచి అవమానించారని, మీర్‌పేట్‌కు చెందిన కార్పొరేటర్‌లు అక్కి మాధవి, జిల్లాల అరుణ, బైగల బాలామణి సభా వేదిక ప్రారంభంలోనే వెనుదిరిగారు.

నా కంటే ముందే ఉద్యకారులను వేదికమీదకు పిలవండి : మంత్రి

అందరూ పార్టీ కుటుంబ సభ్యులేనని, ఇప్పటినుంచి ఏ సమావేశం జరిగినా నన్ను పిలవడానికి ముందే ఉద్యమకారులను వేదిక మీదకు పిలవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ నేతలకు సూచించారు. అంతేగాకుండా పార్టీ కమిటీల్లోనూ ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. వాళ్ల కష్టం తెలంగాణ ఉద్యమ సాధనలో కీలకమైనదని, వారి త్యాగఫలమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం నిరసన వ్యక్తం చేసిన ఉద్యమ కారులను వేదికమీదకు పిలిచారు. అంతేగాకుండా.. వారందరినీ ముందు వరుసలో కూర్చొబెట్టడంతో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి నిరసనకారులకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో హన్మంత్ రావు నిరసనను పక్కన పెట్టి ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. దీంతో సభా ప్రాంగణం మొత్తం హర్షం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News