ఇండియాస్ బిగ్గెస్ట్ సెట్.. ‘ఆచార్య’ టెంపుల్ టౌన్

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఆచార్య’ సెట్‌పై ఎన్నో వార్తలు వచ్చాయి. రూ. 20 కోట్లతో సెట్ వేశారని, చాలా అద్భుతంగా ఉంటుందని మీడియా ప్రచారం చేసింది కానీ, సెట్ వ్యూ మాత్రం బయటకు రాలేదు. ఈ క్రమంలోనే సెట్‌కు ముగ్ధుడైన హీరో చిరంజీవి ప్రేక్షకులకు ‘టెంపుల్ టౌన్’ను పరిచయం చేస్తూ వీడియో షేర్ చేశాడు. 20 ఎకరాల్లో వేసిన ఈ సెట్ ఇండియాలోనే అతిపెద్దది అని.. చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని తెలిపాడు. గాలి గోపురాన్ని అద్భుతంగా మలిచిన […]

Update: 2021-01-06 06:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఆచార్య’ సెట్‌పై ఎన్నో వార్తలు వచ్చాయి. రూ. 20 కోట్లతో సెట్ వేశారని, చాలా అద్భుతంగా ఉంటుందని మీడియా ప్రచారం చేసింది కానీ, సెట్ వ్యూ మాత్రం బయటకు రాలేదు. ఈ క్రమంలోనే సెట్‌కు ముగ్ధుడైన హీరో చిరంజీవి ప్రేక్షకులకు ‘టెంపుల్ టౌన్’ను పరిచయం చేస్తూ వీడియో షేర్ చేశాడు. 20 ఎకరాల్లో వేసిన ఈ సెట్ ఇండియాలోనే అతిపెద్దది అని.. చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని తెలిపాడు. గాలి గోపురాన్ని అద్భుతంగా మలిచిన తీరుకు ఫిదా అయిన చిరు.. ఇది కళా దర్శకత్వ ప్రతిభకే ఓ ఉదాహరణ అని ప్రశంసించారు. నిజంగానే ఓ టెంపుల్ టౌన్‌లో ఉన్నామనే ఫీలింగ్‌ను తీసుకొచ్చిన కళాదర్శకులు సురేశ్, అద్భుతంగా విజువలైజ్ చేసిన దర్శకుడు కొరటాల శివ, భారీగా ఖర్చుపెట్టి సెట్ వేయించిన నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్‌ను అభినందించారు చిరు.

Tags:    

Similar News