‘ఆచార్య’కు కాస్ట్ కటింగ్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ కరోనా ఎఫెక్ట్‌తో మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. త్వరలోనే సినిమా షూటింగ్స్ ప్రారంభం కానుండగా.. లాక్‌డౌన్ నిబంధనలతో చిత్రీకరణ జరిపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ సినిమా యూనిట్ చిత్రీకరణకు సన్నద్ధం అవుతోందట. అయితే లాక్‌డౌన్‌ కారణంగా చిత్ర పరిశ్రమను కుదేలవ్వగా.. నటులు తమ పారితోషికాన్ని తగ్గించుకోవాలని ఇప్పటికే బడా నిర్మాతలు కోరారు. […]

Update: 2020-06-09 08:05 GMT

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ కరోనా ఎఫెక్ట్‌తో మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. త్వరలోనే సినిమా షూటింగ్స్ ప్రారంభం కానుండగా.. లాక్‌డౌన్ నిబంధనలతో చిత్రీకరణ జరిపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ సినిమా యూనిట్ చిత్రీకరణకు సన్నద్ధం అవుతోందట. అయితే లాక్‌డౌన్‌ కారణంగా చిత్ర పరిశ్రమను కుదేలవ్వగా.. నటులు తమ పారితోషికాన్ని తగ్గించుకోవాలని ఇప్పటికే బడా నిర్మాతలు కోరారు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్‌లోనూ ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆచార్య బడ్జెట్‌లోనూ కోత విధించారట. అంతేకాదు స్క్రిప్ట్‌లోనూ సమూల మార్పులు చేస్తూ.. బడ్జెట్‌ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారట కొరటాల.

ఈ మార్పుల వల్ల సినిమా కథ, కథనాలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని.. అంతే గొప్పగా ప్రాజెక్ట్ అవుట్‌పుట్ ఉండబోతుందని సన్నిహిత వర్గాల టాక్. దేవాదాయ శాఖలో అవినీతిపై పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా స్ట్రాంగ్ మెస్సేజ్‌తో వస్తుండగా.. చిరు నక్సలైట్‌గా, చరణ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News