అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్ ఏం చెబుతోందంటే..
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ రిపోర్ట్‌లో “నిబంధనలను పాటించకుండానే టెలీ హెల్త్ సర్వీసులకు కాంట్రాక్టులు ఇచ్చారు. దీనికి ఆర్థికశాఖ అనుమతి కూడా తీసుకోలేదు. కనీసం బడ్జెట్ ఆమోదం కూడా లేదు. ప్రభుత్వంతో ఎంవోయూ కూడా చేసుకోలేదు. టెండర్లు పిలవలేదు. పిలవకపోవడానికి గల కారణాలకు కూడా వెల్లడించలేదు. కాంట్రాక్టు ఇచ్చిన సంస్థకు గత అనుభవం కూడా లేదు. టెలీ […]
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ రిపోర్ట్‌లో “నిబంధనలను పాటించకుండానే టెలీ హెల్త్ సర్వీసులకు కాంట్రాక్టులు ఇచ్చారు. దీనికి ఆర్థికశాఖ అనుమతి కూడా తీసుకోలేదు. కనీసం బడ్జెట్ ఆమోదం కూడా లేదు. ప్రభుత్వంతో ఎంవోయూ కూడా చేసుకోలేదు. టెండర్లు పిలవలేదు. పిలవకపోవడానికి గల కారణాలకు కూడా వెల్లడించలేదు. కాంట్రాక్టు ఇచ్చిన సంస్థకు గత అనుభవం కూడా లేదు. టెలీ హెల్త్ సర్వీసులకు కాంట్రాక్టులు ఇవ్వాలని కార్మికశాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు అధికారులపై మూడు సార్లు ఒత్తిడి చేశారు. ఆయన ఒత్తిడి మేరకే కాంట్రాక్టులు ఇచ్చారు.
అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు రూ.4.15 కోట్లు విడుదల చేశామని ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ కుమార్ తెలిపారు. అప్పట్లో అచ్చెన్నాయుడుకి మంత్రిగా, టీడీపీలో కీలక నేతగా చాలా పలుకుబడి ఉంది. ఈ కేసులో చాలా మందిని విచారించాల్సి ఉంది. సాక్ష్యాలను, డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉంది. కేసులో మొదటి నిందితుడు డాక్టర్ రమేశ్, రెండో నిందితుడు అచ్చెన్నాయుడు, మూడో నిందితుడు టెలీహెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రమోద్ రెడ్డి. వీరికి జ్యుడీషియల్ రిమాండ్ విధించాలి. అచ్చెన్నాయుడుపై ఐపీసీ 409, 420, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదైంది” అని ఏసీబీ పేర్కొంది.