ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు?
ఏపీ టీడీపీ పగ్గాలు ఫైర్ బ్రాండ్ అచ్చెన్నాయుడుకు అప్పగించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. 2019 ఎలక్షన్స్‌లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన కళా వెంకట్రావు ఈ మధ్యకాలంలో కాస్త సైలెంట్ అయిపోయారు. మీడియా ముందుకు వచ్చిపార్టీ వాణి వినిపించడంలో కూడా కాస్త వెనుక పడిపోయారు. ఈ క్రమంలోనే పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన చంద్రబాబు ఇటీవలే టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా […]
ఏపీ టీడీపీ పగ్గాలు ఫైర్ బ్రాండ్ అచ్చెన్నాయుడుకు అప్పగించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. 2019 ఎలక్షన్స్‌లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన కళా వెంకట్రావు ఈ మధ్యకాలంలో కాస్త సైలెంట్ అయిపోయారు. మీడియా ముందుకు వచ్చిపార్టీ వాణి వినిపించడంలో కూడా కాస్త వెనుక పడిపోయారు. ఈ క్రమంలోనే పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన చంద్రబాబు ఇటీవలే టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా అనితను నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపైనా ఫోకస్ పెట్టిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీలో సీనియర్ల అభిప్రాయాలు సైతం తీసుకుంటున్నారు.
మెజార్టీ నేతలంతా ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడు పేరునే బలంగా వినిపిస్తుండటంతో ఆయన వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతోపాటు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తనదైన శైలిలో మాట్లాడి గట్టెక్కించాడన్న పేరు ఉండటంతో క్యాడర్ కూడా అచ్చెన్నాయుడు పేరునే సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ హయాం నుంచి అచ్చెన్నాయుడు ఫ్యామిలీ మొత్తం టీడీపీ కోసం కష్టపడటంతోపాటు జనాల మధ్యే తిరుగుతూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటోందన్న పేరుంది. అసెంబ్లీలో బంపర్ మెజార్టీ ఉన్న వైసీపీకి ధీటుగా అచ్చెన్నాయుడు అయితేనే మాట్లాడగలడని క్యాడరంతా నమ్ముతోంది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి విషయమై అచ్చెన్నాయుడుతో చర్చించారని, దీనికి అచ్చెన్నాయుడు కూడా ఓకే చెప్పారని పార్టీ శ్రేణుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలుగు యువత అధ్యక్ష పదవిని సైతం భర్తీ చేసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తుండగా, ఎంపీ రామ్మోహన్ నాయుడుతోపాటు పరిటాల శ్రీరామ్ ఈ పదవిపై టప్ ఫైట్‌గా ఉన్నారని తెలుస్తోంది. ఇద్దరిలో చంద్రబాబు ఎవరివైపు మొగ్గు చూపి పదవి కట్టబెడుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నెల చివరివారం వరకు పార్టీ పదవులను భర్తీ చేయాలని భావిస్తున్న చంద్రబాబు అధ్యక్ష, తెలుగు యువత పదవులను ఎవరికీ అప్పగిస్తారన్నది ఆసక్తిగా మారింది.