ప్రియాంక గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదాని కొకటి నాలుగు ఢీకొన్నాయి. ప్రియాంక గాంధీతో పాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా రాంపూర్‌లో గురువారం ఉదయం దగ్గర ఘటన జరిగింది. జనవరి 26న మరణించిన రైతు నవరత్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రియాంక గాంధీ ప్రయాణిస్తున్న కారు వైపర్లు పనిచేయకపోవడంతో, […]
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదాని కొకటి నాలుగు ఢీకొన్నాయి. ప్రియాంక గాంధీతో పాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా రాంపూర్‌లో గురువారం ఉదయం దగ్గర ఘటన జరిగింది. జనవరి 26న మరణించిన రైతు నవరత్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రియాంక గాంధీ ప్రయాణిస్తున్న కారు వైపర్లు పనిచేయకపోవడంతో, అద్దంపై దుమ్ము పేరుకోవడం వల్ల డ్రైవర్ వేగాన్ని తగ్గించగా.. వెనుక ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నట్లు తెలుస్తోంది.