బదిలీ అయినా అక్రమాలను బయటకు తీస్తున్నారు

దిశ, వెబ్‌డెస్క్: అందిన కాడికి దోచుకున్న ఓ ఎమ్మార్వో బదిలీతో అంతా ముగిసిందనుకున్నాడు. కానీ, చేసుకున్న దానికి అనుభవించక తప్పదు అన్నట్టుగా అతడి కథ మలుపుతిరిగింది. అవినీతి చేసి ఎక్కడి నుంచి బదిలీ అయ్యాడో.. ఆ కార్యాలయంలో ఏం జరుగుతుందో అంటూ ప్రస్తుతం బిక్కు బిక్కుమంటున్నాడు. ఎందుకంటే.. అతడు గతంలో చేసిన అక్రమ కార్యాకలాపాలపై అధికారులు సోదాలు చేస్తున్నారు. కుమురం భీం జిల్లా చింతలమానేపల్లి ఏమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అదే కార్యాలయంలో ఇటీవల […]

Update: 2020-07-31 07:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: అందిన కాడికి దోచుకున్న ఓ ఎమ్మార్వో బదిలీతో అంతా ముగిసిందనుకున్నాడు. కానీ, చేసుకున్న దానికి అనుభవించక తప్పదు అన్నట్టుగా అతడి కథ మలుపుతిరిగింది. అవినీతి చేసి ఎక్కడి నుంచి బదిలీ అయ్యాడో.. ఆ కార్యాలయంలో ఏం జరుగుతుందో అంటూ ప్రస్తుతం బిక్కు బిక్కుమంటున్నాడు. ఎందుకంటే.. అతడు గతంలో చేసిన అక్రమ కార్యాకలాపాలపై అధికారులు సోదాలు చేస్తున్నారు.

కుమురం భీం జిల్లా చింతలమానేపల్లి ఏమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అదే కార్యాలయంలో ఇటీవల విధులు నిర్వర్తించి.. బదిలీ అయినా తహసీల్దార్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మార్వో నియాజోద్దిన్ చింతలమానేపల్లి మండల కార్యాలయానికి వచ్చిన రైతుల నుంచి పట్టా పుస్తకాల కోసం లక్షల్లో వసూళ్లు చేశాడని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా తీసుకున్న డబ్బులు చెల్లించాలని బాధిత రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నియాజోద్దిన్ అక్రమాలపై ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News