హెచ్‌ఎండీఏ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు

దిశ, వెబ్ డెస్క్: గచ్చిబౌలిలోని నానక్‌రామ్‌గూడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం సోదాలను నిర్వహించారు. నానక్ రాంగూడతో పాటు దూలపల్లి అటవీ శాఖ క్యార్టర్స్ లోని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అర్బన్ ఫారెస్ట్రీ వింగ్ అధికారి ఇనుపనూరి ప్రకాశ్ ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఔటర్ రింగు రోడ్డు ప్రాంతాల్లో చెట్లను పెంచే విషయానికి సంబంధించి బిల్లుల్లో లంచాలను తీసుకున్నట్టు ఏసీబీ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో గచ్చిబౌలీతో పాటు […]

Update: 2020-12-11 07:24 GMT

దిశ, వెబ్ డెస్క్: గచ్చిబౌలిలోని నానక్‌రామ్‌గూడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం సోదాలను నిర్వహించారు. నానక్ రాంగూడతో పాటు దూలపల్లి అటవీ శాఖ క్యార్టర్స్ లోని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అర్బన్ ఫారెస్ట్రీ వింగ్ అధికారి ఇనుపనూరి ప్రకాశ్ ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఔటర్ రింగు రోడ్డు ప్రాంతాల్లో చెట్లను పెంచే విషయానికి సంబంధించి బిల్లుల్లో లంచాలను తీసుకున్నట్టు ఏసీబీ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో గచ్చిబౌలీతో పాటు నానక్ రాం గూడలోని ఆయన కార్యాలయంలో ఏసీబీ సోదాలను నిర్వహించింది. కాగా సోదాల్లో ఆయన చాంబర్‌లో రూ. 10లక్షల 50వేలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రకాశ్ కారులో కూడా రూ. 19వేల 800లను ఏసీబీ అధికారులు గుర్తించారు.

Tags:    

Similar News