లక్షలు చేతికొచ్చే సమయంలో.. ఏసీబీ సడన్ ఎంట్రీ
దిశ, మహబూబాబాద్: రూ. 2 లక్షలు లంచంగా తీసుకుంటూ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రావూరి రాజు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే మరిపెడ మండలంలోని హాస్టల్ వార్డెన్ బాలరాజు సస్పెన్షన్ కాలం బిల్లులు చెల్లించేందుకు రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అంత డబ్బు చెల్లించలేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. మధ్యవర్తిగా ఆ ఆఫీస్ వాచ్మెన్ గురుచరన్ ద్వారా రూ. 2 లక్షల నగదును […]
దిశ, మహబూబాబాద్: రూ. 2 లక్షలు లంచంగా తీసుకుంటూ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రావూరి రాజు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే మరిపెడ మండలంలోని హాస్టల్ వార్డెన్ బాలరాజు సస్పెన్షన్ కాలం బిల్లులు చెల్లించేందుకు రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అంత డబ్బు చెల్లించలేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. మధ్యవర్తిగా ఆ ఆఫీస్ వాచ్మెన్ గురుచరన్ ద్వారా రూ. 2 లక్షల నగదును తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.