గవర్నర్‌ను కలిసిన ఏబీవీపీ నాయకులు
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిస్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు శనివారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమవుతున్న పరిస్థితి ఒకవైపు, మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న నిర్యుదోగ సమస్యలతో తెలంగాణలో విద్యార్థి,నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ కేంద్రాలైన యూనివర్సిటీలకు వీసీలు లేక పాలన […]
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిస్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు శనివారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమవుతున్న పరిస్థితి ఒకవైపు, మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న నిర్యుదోగ సమస్యలతో తెలంగాణలో విద్యార్థి,నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ కేంద్రాలైన యూనివర్సిటీలకు వీసీలు లేక పాలన పూర్తిగా కుంటుపడిందన్నారు. రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీలకు తొమ్మిది నెలలుగా వైస్ ఛాన్సులర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అన్ని యూనివర్సిటీల్లో అవసరమైన 2766(60% పైగా ఖాళీలను) అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ కోఠి ఉమెన్స్ కళాశాలను ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. తెలంగాణ బడ్జెట్‌లో విద్యారంగాన్ని పూర్తి విస్మరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి.శంకర్, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: ABVP leaders, meet the governor, Women’s University, UC, Education, Budget