తమిళనాడు, బెంగాల్, కేరళ ఎన్నికలపై ఏబీపీ- సీ ఓటర్ సర్వే
దిశ, వెబ్‌డెస్క్: దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమిళనాడు, బెంగాల్, కేరళ ఎన్నికలపై ఏబీపీ- సీ ఓటర్ సర్వే నిర్వహించింది. తమిళనాడులో ఏఐఏడీఎంకు షాక్ తప్పదని, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ అధికారం కైవసం చేసుకుంటుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. అటు బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ.. మరోసారి అధికారాన్ని నిలుపుకొంటుందని, కేరళలోనూ పినరయి విజయన్ విక్టరీ కొడుతారని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. సర్వే ఫలితాలు ఇలా… తమిళనాడులో మొత్తం 234 స్థానాలు […]
దిశ, వెబ్‌డెస్క్: దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమిళనాడు, బెంగాల్, కేరళ ఎన్నికలపై ఏబీపీ- సీ ఓటర్ సర్వే నిర్వహించింది. తమిళనాడులో ఏఐఏడీఎంకు షాక్ తప్పదని, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ అధికారం కైవసం చేసుకుంటుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. అటు బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ.. మరోసారి అధికారాన్ని నిలుపుకొంటుందని, కేరళలోనూ పినరయి విజయన్ విక్టరీ కొడుతారని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
సర్వే ఫలితాలు ఇలా…
తమిళనాడులో మొత్తం 234 స్థానాలు
డీఎంకే- కాంగ్రెస్ కూటమి: 158- 166 స్థానాలు
ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమి: 60- 68 స్థానాలు
కమల్‌హాసన్ పార్టీ (ఎంఎన్ఎం) గరిష్టంగా 4 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు
టీఎంసీ- 158 స్థానాలు (43శాతం ఓట్లు)
బీజేపీ 102 స్థానాలు(37.5శాతం ఓట్లు)
కాంగ్రెస్- లెప్ట్ పార్టీలు 30 స్థానాలు(12శాతం ఓట్లు)
కేరళలో మొత్తం 140 స్థానాలు
ఎల్‌డీఎఫ్ 81-89 (42శాతం ఓట్లు)
యూడీఎఫ్ 49- 57స్థానాలు (35 శాతం ఓట్లు)
బీజేపీకి గరిష్టంగా రెండు స్థానాలు వస్తాయని ఏబీపీ- సీ ఓటర్ సర్వే తెలిపింది.