ఆర్థిక పునరుద్ధరణపై ఆశలు పెంచుకున్న పరిశ్రమ వర్గాలు!

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమ వర్గాల్లో 50 శాతం మంది రాబోయే కేంద్ర బడ్జెట్‌లో తమ వ్యాపారాల పునరుద్ధరణకు అనుకూలమైన ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నాయి. అంతేకాకుండా చాలామంది ఆర్థిక పునరుద్ధరణ, డిమాండ్ వృద్ధి ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నట్టు డెలాయిట్ నివేదిక శుక్రవారం తెలిపింది. పరిశ్రమ వర్గాల్లోని కొందరు పన్ను మినహాయింపుల పరిమితిని పెంచడం వల్ల ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులను పెంచుతుందని భావిస్తుండగా, 50 శాతం మంది డిమాండ్ పునరుజ్జీవనానికి ప్రాధాన్యత ఇవ్వాలని […]

Update: 2021-01-22 08:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమ వర్గాల్లో 50 శాతం మంది రాబోయే కేంద్ర బడ్జెట్‌లో తమ వ్యాపారాల పునరుద్ధరణకు అనుకూలమైన ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నాయి. అంతేకాకుండా చాలామంది ఆర్థిక పునరుద్ధరణ, డిమాండ్ వృద్ధి ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నట్టు డెలాయిట్ నివేదిక శుక్రవారం తెలిపింది. పరిశ్రమ వర్గాల్లోని కొందరు పన్ను మినహాయింపుల పరిమితిని పెంచడం వల్ల ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులను పెంచుతుందని భావిస్తుండగా, 50 శాతం మంది డిమాండ్ పునరుజ్జీవనానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తున్నారు. ముఖ్యంగా కరోనా ఆంక్షల నేపథ్యంలో ఆర్థిక, ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలు వినియోగంపై ప్రభావితం చేశాయి. మరికొంత కాలం డిమాండ్ కరోనాకు పూర్వస్థాయిలోనే ఉండొచ్చని డెలాయిట్ నివేదిక అభిప్రాయపడింది. ఆదాయం, డిమాండ్ పెంచడంతో పాటు మరీ ముఖ్యంగా ఉద్యోగాల సృష్టిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. కరోనా టీకా పంపిణీ, ప్రభుత్వ ఉద్దీపణ ప్యాకేజీ, మౌలిక సదుపాయాలు, భారత్ ఉత్పాదక కేంద్రంగా మారడం, డిజిటలైజేషన్ ప్రయత్నాలు వృద్ధికి అవసరమైన ప్రేరణను ఇస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags:    

Similar News