కరోనా టెస్ట్.. 300 మంది ప్రయాణికులు పరార్

గువహతి: అసోంలోని ఓ విమానాశ్రయంలో తప్పనిసరి కరోనా టెస్టును తప్పించుకుని కనీసం 300 మంది ప్రయాణికులు పరారయ్యారు. బుధవారం జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతున్నది. రాష్ట్రం వెలుపలి నుంచి వచ్చిన విమాన ప్రయాణికులందరూ ఎయిర్‌పోర్టులో కరోనా టెస్టు చేయించుకోవడం తప్పనిసరి నిబంధన. కానీ, ఈ నిబంధనను ఖాతరు చేయకుండా అధికారుల కళ్లుగప్పి 300 మంది ప్రయాణికులు తప్పించుకున్నారు. అసోంలోని సిల్చార్ ఎయిర్‌పోర్టుకు బుధవారం మొత్తం ఏడు విమానాలు వచ్చాయి. ఇందులో 690 మంది ప్రయాణికులు […]

Update: 2021-04-22 05:40 GMT

గువహతి: అసోంలోని ఓ విమానాశ్రయంలో తప్పనిసరి కరోనా టెస్టును తప్పించుకుని కనీసం 300 మంది ప్రయాణికులు పరారయ్యారు. బుధవారం జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతున్నది. రాష్ట్రం వెలుపలి నుంచి వచ్చిన విమాన ప్రయాణికులందరూ ఎయిర్‌పోర్టులో కరోనా టెస్టు చేయించుకోవడం తప్పనిసరి నిబంధన. కానీ, ఈ నిబంధనను ఖాతరు చేయకుండా అధికారుల కళ్లుగప్పి 300 మంది ప్రయాణికులు తప్పించుకున్నారు.

అసోంలోని సిల్చార్ ఎయిర్‌పోర్టుకు బుధవారం మొత్తం ఏడు విమానాలు వచ్చాయి. ఇందులో 690 మంది ప్రయాణికులు ఇక్కడ దిగారు. కానీ, ఇందులో 189 మంది మాత్రమే కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఇందులో కొందరు రాష్ట్రంలోని గువహతి నుంచి రావడం, మరికొందరు ఇతరు ఈశాన్య రాష్ట్రాల(ట్రాన్సిట్)కు ప్రయాణిస్తున్నవారున్నారు. టెస్టు చేసుకున్నవారిలో ఆరుగురికి పాజిటివ్ రావడం గమనార్హం. వీరు మినహా దాదాపు 300 మంది ప్రయాణికులు టెస్టులు చేయించుకోకుండా తప్పించుకున్నారని కాచర్ జిల్లా ఏడీసీ(హెల్త్) సుమిత్ సత్తావన్ వెల్లడించారు.

సిల్చార్ ఎయిర్‌పోర్టు చిన్నదికావడంతో సమీపంలోని ఆస్పత్రిలో టెస్టులు చేస్తున్నారు. అక్కడికి వెళ్లడానికి ప్రభుత్వమే వాహనాలను ఏర్పాటు చేసింది. కానీ, ఈ ప్రయాణికులు ఎలా తప్పించుకున్నారో ఇంకా తెలియదని, ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ప్రయాణికుల వివరాలన్నీ తమ దగ్గర ఉన్నాయని తెలిపారు.

Tags:    

Similar News