ఫిల్మ్ ఇండస్ట్రీపై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్.. పెద్ద వ్యాపారం అంటూ…
దిశ, సినిమా : బిగ్ బీ అమితాబ్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్.. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాప్స్‌తో సతమతమయ్యాడు. ఆ తర్వాత తన యాక్టింగ్‌కు మెరుగులు దిద్దుకుని నటుడిగా ఫ్రూవ్ చేసుకున్నాడు. కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ విషయాలు షేర్ చేసుకుని కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఫిలిం ఇండస్ట్రీ కల్చర్ గురించి మాట్లాడుతూ.. ‘నటుడిగా కొన్నిసార్లు వరుస సినిమాలు చేశాను. మరికొన్నిసార్లు చేతిలో ఒక్క ప్రాజెక్టు లేకుండా ఖాళీగా కూర్చున్నాను. […]
దిశ, సినిమా : బిగ్ బీ అమితాబ్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్.. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాప్స్‌తో సతమతమయ్యాడు. ఆ తర్వాత తన యాక్టింగ్‌కు మెరుగులు దిద్దుకుని నటుడిగా ఫ్రూవ్ చేసుకున్నాడు. కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ విషయాలు షేర్ చేసుకుని కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఫిలిం ఇండస్ట్రీ కల్చర్ గురించి మాట్లాడుతూ.. ‘నటుడిగా కొన్నిసార్లు వరుస సినిమాలు చేశాను. మరికొన్నిసార్లు చేతిలో ఒక్క ప్రాజెక్టు లేకుండా ఖాళీగా కూర్చున్నాను. అయితే ఏ విషయాన్నైనా ఎలా అర్థం చేసుకుంటున్నామన్నదే ముఖ్యం. సినిమా అనేది జస్ట్ బిజినెస్ అంతే. మన ప్రీవియస్ సినిమాలు బాగా ఆడితే తప్ప మనమీద పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకురారు. ఇండస్ట్రీలో 20 ఏళ్లకు పైగా కొనసాగుతున్న నేను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను’ అని వివరించాడు.
అలాగే బిగ్ బీ కొడుకును కాబట్టి తనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడతారని చాలామంది అనుకుంటారన్న అభిషేక్.. అదంతా ఒట్టి పుకారే అని కొట్టిపారేశాడు. తన మొదటి సినిమా పట్టాలెక్కేందుకే దాదాపు రెండేళ్లు పట్టిందని తెలిపాడు.