బీసీసీఐ, ఐపీఎల్‌పై బింద్రా ఘాటు వ్యాఖ్యలు

దిశ, స్పోర్ట్స్ : ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా ప్రస్తుతం ఐపీఎల్‌లో పాల్గొంటున్న క్రికెటర్లు, బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోవిడ్ రెండో వేవ్ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఐపీఎల్‌ను కొనసాగించడంపై అసంతృప్తి వ్యక్తంచేశాడు. దేశంలోని కోవిడ్ పరిస్థితిపై క్రికెటర్లు పట్టించుకోకుండా కళ్లు మూసుకోవడంపై ఆయన మండిపడ్డారు. జాతీయ ఆంగ్ల పత్రికకు రాసిన ఒక కాలమ్‌లో పలు విషయాలను ఆయన చర్చించారు. ‘క్రికెటర్లు, బీసీసీఐ అధికారులు తమ బయోబబుల్‌లో జీవిస్తూ.. దేశంలో ఏం జరుగుతున్నదనే విషయంపై […]

Update: 2021-04-26 10:44 GMT

దిశ, స్పోర్ట్స్ : ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా ప్రస్తుతం ఐపీఎల్‌లో పాల్గొంటున్న క్రికెటర్లు, బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోవిడ్ రెండో వేవ్ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఐపీఎల్‌ను కొనసాగించడంపై అసంతృప్తి వ్యక్తంచేశాడు. దేశంలోని కోవిడ్ పరిస్థితిపై క్రికెటర్లు పట్టించుకోకుండా కళ్లు మూసుకోవడంపై ఆయన మండిపడ్డారు. జాతీయ ఆంగ్ల పత్రికకు రాసిన ఒక కాలమ్‌లో పలు విషయాలను ఆయన చర్చించారు.

‘క్రికెటర్లు, బీసీసీఐ అధికారులు తమ బయోబబుల్‌లో జీవిస్తూ.. దేశంలో ఏం జరుగుతున్నదనే విషయంపై చెవిటి, గుడ్డి వారిగా మారిపోయారు. మీరు స్టేడియంలో ఐపీఎల్ గేమ్స్ ఆడుతున్నారు. కానీ స్టేడియం బయట మాత్రం ఆంబులెన్సులు పరుగులు తీస్తున్నాయి. టీవీల్లో ఐపీఎల్ కవరేజి ఎలా ఉన్నదో నాకు తెలియదు. కానీ కొంచెం నిశ్శబ్దంగా ఆడుకోండి. పెద్దగా సంబరాలు చేసుకోకండి. ఎందుకంటే బయట ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సమాజం పట్ల గౌరవంగా వ్యవహరించడండి. ఈ క్రికెటర్ల చాలా అదృష్టవంతులు. ఇలాంటి సమయంలో కూడా ఆట ఆడగలుగుతున్నారు. నేను బీసీసీఐ అధ్యక్షుడిని అయితే భారీ మొత్తంలో డబ్బును వాక్సినేషన్ కోసం ఇచ్చే వాడిని. ఇప్పటికైనా సరైన విధంగా స్పందించండి’ అని బింద్రా తన కాలమ్‌లో రాసుకొచ్చాడు.

Tags:    

Similar News