క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్.. క్రికెట్‌కు AB డివిలియర్స్ గుడ్ బై

దిశ, వెబ్‌డెస్క్ : క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. దక్షిణాఫ్రికా ప్లేయర్, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ క్రికెట్ కేరీర్‌పై కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లు శుక్రవారం ప్రకటించాడు ఏబీ డివిలియర్స్‌. వయస్సు పెరుగుతున్న కారణంగా తాను రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. ‘ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి రిటైర్‌ కావాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నా వయస్సు 37 సంవత్సరాలు దాటింది’ అంటూ ఏబీడీ […]

Update: 2021-11-19 03:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ : క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. దక్షిణాఫ్రికా ప్లేయర్, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ క్రికెట్ కేరీర్‌పై కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లు శుక్రవారం ప్రకటించాడు ఏబీ డివిలియర్స్‌. వయస్సు పెరుగుతున్న కారణంగా తాను రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు.

‘ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి రిటైర్‌ కావాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నా వయస్సు 37 సంవత్సరాలు దాటింది’ అంటూ ఏబీడీ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. అయితే ఏబీడీ.. ఐపీఎల్‌‌లో బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక, ఏబీడీ తన కేరీర్‌లో టెస్టుల్లో 22, వన్డేల్లో 25, ఐపీఎల్‌లో 3 సెంచరీలు సాధించాడు.

ఇదిలా ఉండగా ఏబీడీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం టీ20ల్లో అయినా ఏబీడీ ఆడాలని కోరుతున్నారు.

 

Tags:    

Similar News