ఎన్నికల విధుల్లో 'ఆశా' వర్కర్ మృతి
దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ‘ఆశా’ వర్కర్ వినోద మృతిచెందారు. బేగంపేటలోని వెస్లీ డిగ్రీ, పీజీ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న వినోద… పనులన్నీ ముగించుకున్న తర్వాత బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు స్పృహ తప్పి పడిపోయారు. గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందారు. మృతురాలిని ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ముర్తుజాపల్లి గ్రామానికి చెందిన ‘ఆశా’ వర్కర్‌గా గుర్తించారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ‘ఆశా’ వర్కర్ వినోద మృతిచెందారు. బేగంపేటలోని వెస్లీ డిగ్రీ, పీజీ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న వినోద… పనులన్నీ ముగించుకున్న తర్వాత బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు స్పృహ తప్పి పడిపోయారు. గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందారు.
మృతురాలిని ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ముర్తుజాపల్లి గ్రామానికి చెందిన ‘ఆశా’ వర్కర్‌గా గుర్తించారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగిపోయినందున స్పృహ తప్పి పడిపోయినట్లుగా వైద్యుల ప్రాథమిక పరీక్షల్లో తేలింది. అప్పటివరకూ ఆమెకు షుగర్ ఉన్నట్లుగా కూడా తెలియదని, ఇప్పుడే హఠాత్తుగా పెరిగిపోయి ఉండవచ్చని ఆమె సన్నిహితులు తెలిపారు. విధి నిర్వహణలో ఉంటూ చనిపోయినందున ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైద్య సిబ్బంది కోరుతున్నారు.