నల్లా కనెక్షన్ ఇక అంత సులువు కాదు.. ఆధార్ సహా 10 రకాల ఐడీలు తప్పని సరి!

దిశ, తెలంగాణ బ్యూరో : సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆధార్’ కార్డు ఆధారంగా అనేక నూతన విధానాలను తెరపైకి తెస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఇంటికీ నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. మరో రెండేళ్లలో (2024 నాటికి) దీన్ని పూర్తిచేయాలని భావించింది. క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు పర్యవేక్షణకూ ప్రత్యేక మెకానిజాన్ని రూపొందించింది. ప్రతీ నల్లా కనెక్షన్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం ద్వారా […]

Update: 2021-12-12 18:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆధార్’ కార్డు ఆధారంగా అనేక నూతన విధానాలను తెరపైకి తెస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఇంటికీ నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. మరో రెండేళ్లలో (2024 నాటికి) దీన్ని పూర్తిచేయాలని భావించింది. క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు పర్యవేక్షణకూ ప్రత్యేక మెకానిజాన్ని రూపొందించింది. ప్రతీ నల్లా కనెక్షన్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ భావించింది. ఇందుకోసం ఆధార్ చట్టంలోని సెక్షన్ 7ను వర్తింపజేయాలనుకున్నది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ సూచనలు కూడా చేసింది.

కుటుంబ పెద్దకు ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా కొత్త కనెక్షన్లు ఇవ్వాలని కూడా జలశక్తి మంత్రిత్వశాఖ భావిస్తున్నది. ఒకవేళ ఆధార్ కార్డు వివరాలు లేనట్లయితే దానికి ప్రత్యామ్నాయంగా ఫొటోతో కూడిన బ్యాంకు/పోస్టాఫీసు పాస్‌బుక్, పాన్ కార్డు, పాస్‌‌పోర్టు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డు, కిసాన్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్సు, ప్రభుత్వం జారీ చేసిన ఏదేని ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు లాంటి పది రకాలవి చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నది. కొన్ని చోట్ల ఇంటర్నెట్ సమస్యలు, లబ్ధిదారుల వేలిముద్రలను బయోమెట్రిక్ మిషన్లు గుర్తించకపోవడం తదితరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆఫ్ లైన్‌లో కూడా ఆధార్ కార్డు వివరాలను పరిగణనలోకి తీసుకోనుకున్నట్లు జలశక్తి పేర్కొన్నది. కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీ వ్యవస్థను కూడా ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది.

అయితే ఈ ఆధారాలు ఏవీ లేవన్న కారణంతో లబ్ధిదారులకు నల్లా కనెక్షన్ ఇవ్వకూడదనే నిర్బంధం ఏమీ ఉండదని, కానీ జవాబుదారీతనం కోసం మాత్రం ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కొద్దిమంది ఎంపీలకు రాతపూర్వకంగా నాలుగు రోజుల క్రితం వివరించారు. ఆధార్ చట్టంలోని సెక్షన్ 4(6) ప్రకారం ఆర్థికపరమైన సాయం, సబ్సిడీ, లబ్ధిలాంటివి ప్రభుత్వం తరఫున అందించడానికి ఎలాంటి వివరాలు లేవన్న కారణంతో తిరస్కరించరాదన్న నిబంధనకు అనుగుణంగా వివరాలు లేకున్నా నల్లా కనెక్షన్లు ఇస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News