Minister Jupalli KrishnaRao : అధికారులకు భయం, భక్తీ లేవు : మంత్రి జూపల్లి ఆగ్రహం
తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli KrishnaRao) అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli KrishnaRao) అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన శాఖల్లోని అధికారులు కొంతమంది తన నిర్ణయాలను పాటించడం లేదని మండిపడిన జూపల్లి.. అధికారులకు భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి అన్నారు. కాని అవి రెండూ ఏ ఒక్క అధికారికి ఉన్నట్టు కనిపించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ జరగాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన మంత్రి.. మంత్రివర్గ విస్తరణ(Cabinet Expantion) అంటే శాఖల మార్పు అన్నట్లేనని స్పష్టం చేశారు.
కేబినేట్ విస్తరణలో మహబూబ్ నగర్(Mahabub Nagar) జిల్లాకు మరో అవకాశం ఉంటుందని భావిస్తున్నాను అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జిల్లా నుంచి సీఎం ఉన్నప్పటికీ.. ఆయన ఫోకస్ అంతా రాష్ట్రంపైనే ఉంటుందని, అందువలన పాలమూరును మరింత అభివృద్ధి చేసేందుకు మరో మంత్రి పదవి ఈ జిల్లాను వరిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. అయితే ఖచ్చితంగా ఈరోజు మంత్రివర్గ విస్తరణ అని తాను చెప్పలేనని, అది అధిష్టానం చేతుల్లో ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పస్టం చేశారు.