యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘ఆడ నెమలి’

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్‌లో తెలంగాణ పల్లె పాటలకు నెటిజన్లు పట్టం కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది యంగ్ సింగర్స్ ఇలాంటి పాటలతో దుమ్మురేపుతున్నారు. ఇక ఈ తరహా పాటలు పాడటంలో సింగర్ మంగ్లీ ప్రత్యేకతే వేరు. అటు తెలంగాణ పల్లె పాటలే కాకుండా సినిమా పాటలు కూడా పాడుతూ.. కెరీర్‌లో ముందుకు సాగుతోంది. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ మూవీలోని రాములో రాములా.. పాటతో ఫుల్ జోష్ మీదున్న మంగ్లీ.. తాజాగా తన యూట్యూబ్ చానల్‌లో స్వచ్ఛమైన […]

Update: 2020-09-06 04:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్‌లో తెలంగాణ పల్లె పాటలకు నెటిజన్లు పట్టం కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది యంగ్ సింగర్స్ ఇలాంటి పాటలతో దుమ్మురేపుతున్నారు. ఇక ఈ తరహా పాటలు పాడటంలో సింగర్ మంగ్లీ ప్రత్యేకతే వేరు. అటు తెలంగాణ పల్లె పాటలే కాకుండా సినిమా పాటలు కూడా పాడుతూ.. కెరీర్‌లో ముందుకు సాగుతోంది. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ మూవీలోని రాములో రాములా.. పాటతో ఫుల్ జోష్ మీదున్న మంగ్లీ.. తాజాగా తన యూట్యూబ్ చానల్‌లో స్వచ్ఛమైన తెలంగాణ పల్లె గొంతుక ‘కనకవ్వ’తో కలిసి పాడిన ‘ఆడ నెమలి’ అనే పాట దుమ్ములేపుతోంది.

Full View

‘నర్సపెల్లి గండిలోన గంగధారి.. ఆడ నెమ‌లి ఆటలకు గంగధారి’ అంటూ సాగే పాట యూట్యూబ్ ప్రేక్ష‌కుల‌నే కాక‌.. సంగీత ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఆగ‌స్టు 29న విడుదలైన ఈ పాట‌ను మంగ్లీతో పాటు ‘డివ డివ, గుట్ట గుట్ట తిరిగెటోడ’ వంటి జనాదరణ పొందిన పాటలతో యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న జాను లిరీపై చిత్రీకరించారు. ఇప్పటికే తన గాత్రంతో యావత్ తెలంగాణను ఉర్రూతలూగిస్తోన్న కనకవ్వ వాయిస్ ఈ పాటకు ప్రత్యేకార్షణగా నిలిచింది. మంగ్లీ, జాను లిరీ తమ డ్యాన్స్‌తో ఈ పాటకు కొత్త జోష్‌ను తీసుకురాగా.. పల్లెటూరి అందాలను సరికొత్తగా చూపించిన ఈ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన వారం రోజుల్లోనే ఏడున్నర లక్షల మంది వీక్షించడమే అందుకు నిదర్శనం. ఇప్పటికే మంగ్లీ యూట్యూబ్ చానల్‌కు మంచి ఆదరణ దక్కుతుండగా.. 5 లక్షలకు పైగా సబ్‌స్కైబర్లు ఉండటం విశేషం.

Tags:    

Similar News