పెళ్లి ఆగిపోవడంతో ఆ యువతి..
దిశ ప్రతినిధి, మేడ్చల్ : నేటి యువతలో ఆత్మస్థైర్యం రోజురోజుకు కనుమరుగైపోతోంది. చిన్నచిన్న విషయాలకు కూడా ఉసురు తీసుకొని వారి తల్లదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చుతున్నారు. అలాంటి ఘటనే శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శామీర్‌పేట అలియాబాద్‌కు చెందిన లక్ష్మణ్, క్రిష్ణవేణిలు దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్త అనూష (22) లు ఉన్నారు. అనూష డిప్లొమా పూర్తి చేసింది. మూడుచింతలపల్లికి చెందిన ఓ వ్యక్తితో అనూషకు పెళ్లి […]
దిశ ప్రతినిధి, మేడ్చల్ : నేటి యువతలో ఆత్మస్థైర్యం రోజురోజుకు కనుమరుగైపోతోంది. చిన్నచిన్న విషయాలకు కూడా ఉసురు తీసుకొని వారి తల్లదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చుతున్నారు. అలాంటి ఘటనే శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శామీర్‌పేట అలియాబాద్‌కు చెందిన లక్ష్మణ్, క్రిష్ణవేణిలు దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్త అనూష (22) లు ఉన్నారు. అనూష డిప్లొమా పూర్తి చేసింది. మూడుచింతలపల్లికి చెందిన ఓ వ్యక్తితో అనూషకు పెళ్లి నిశ్చయమైంది. అయితే అనివార్యకారణాల వల్ల ఇటీవలే ఆ వివాహం రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన అనూష అప్పటి నుంచి బాధతో ఉంది.
కాగా గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో లక్ష్మణ్, క్రిష్ణవేణిలు తన కుమారుడితో కలిసి కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి వెళ్లి 2గంటల తరువాత తిరిగొచ్చారు. గడియపెట్టి తలుపును తడుతూ అనూష అని ఎంత పిలిచినా పలకకపోవడంతో, ఆందోళన గురైన అనూష తల్లిదండ్రులు బలవంతంగా తలుపు తెరిచారు. అప్పటికే చీరతో ఊరేసుకొని సీలింగ్ ఫ్యాన్ కు అనూష వేలాడుతూ కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం అనూష మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లి క్రిష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.