‘మమ్మీ నేను బ్రతకడానికి వెళుతున్నాను.. నన్ను వెతకకండి’
దిశ, శేరిలింగంపల్లి : ఓ యువతి అదృశ్యమైన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకార దేవికారాణి, రాజేష్ దంపతులు. ఉద్యోగరీత్యా గత ఆరు నెలల నుండి శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కూతురు ఆకార ఉజ్జయిని (18) డిగ్రీ చదువుతోంది. తన తండ్రి మందలించడంతో ఈనెల 6న ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి కొన్ని బట్టలు తీసుకుని ఒక డైరీలో ‘మమ్మీ నేను […]
దిశ, శేరిలింగంపల్లి : ఓ యువతి అదృశ్యమైన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకార దేవికారాణి, రాజేష్ దంపతులు. ఉద్యోగరీత్యా గత ఆరు నెలల నుండి శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కూతురు ఆకార ఉజ్జయిని (18) డిగ్రీ చదువుతోంది.
తన తండ్రి మందలించడంతో ఈనెల 6న ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి కొన్ని బట్టలు తీసుకుని ఒక డైరీలో ‘మమ్మీ నేను బ్రతకడానికి వెళుతున్నాను.. నన్ను వెతకకండి’ అని రాసి పెట్టి ఇంటి నుండి వెళ్ళిపోయింది. తన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వస్తోందని చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఉజ్జయిని తల్లిదండ్రులు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.