పబ్జీ ఎఫెక్ట్… మతిస్థిమితం కోల్పోయిన యువకుడు
దిశ, ఏపీ బ్యూరో: ఆన్‌లైన్ గేమ్స్‌ను అదేపనిగా ఆడితే ఎంతగా నష్టపోతామో తెలిపే సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో చోటుచేసుకుంది. పబ్జీ గేమ్‌కు బానిసై అదేపనిగా ఆడడం మూలంగా ఓ యువకుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఈ ఘటన విశాఖలోని అరకులోయలో బుధవారం చోటు చేసుకుంది. అరకులోయ ప్రాంతానికి చెందిన కౌశిక్ అనే యువకుడికి పబ్జీ గేమ్ ఆడడం ప్రధాన వ్యాపకంగా మారిపోయింది. కుటుంబ సభ్యులు వారించినా పబ్జీ ఆడడంలో మైమరచిపోయేవాడు. ఈ క్రమంలో ఇటీవల పబ్జీ గేమ్ ఆడుతోన్న […]
దిశ, ఏపీ బ్యూరో: ఆన్‌లైన్ గేమ్స్‌ను అదేపనిగా ఆడితే ఎంతగా నష్టపోతామో తెలిపే సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో చోటుచేసుకుంది. పబ్జీ గేమ్‌కు బానిసై అదేపనిగా ఆడడం మూలంగా ఓ యువకుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఈ ఘటన విశాఖలోని అరకులోయలో బుధవారం చోటు చేసుకుంది. అరకులోయ ప్రాంతానికి చెందిన కౌశిక్ అనే యువకుడికి పబ్జీ గేమ్ ఆడడం ప్రధాన వ్యాపకంగా మారిపోయింది. కుటుంబ సభ్యులు వారించినా పబ్జీ ఆడడంలో మైమరచిపోయేవాడు. ఈ క్రమంలో ఇటీవల పబ్జీ గేమ్ ఆడుతోన్న సమయంలో ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తూ పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో కుటుంబ సభ్యులు కౌశిక్‌ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా, ప్రథమ చికిత్సచేసిన వైద్యులు, పబ్జీ గేమ్ వల్ల మతిస్థిమితం కోల్పోయాడని, వైజాగ్ మానసిక చికిత్సాలయానికి తరలించాలని సూచించారు.