22 ఏండ్లకే 12 మంది భార్యలు.. చివరి భార్య మహా ఖతర్నాక్
దిశ, వెబ్‌డెస్క్ : హిందు సాంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తికి ఒక్కరే భార్య ఉండడం సహజం. కానీ ఓ యువకుడు ఏకంగా 12 మందిని వివాహమాడి సంచలనం సృష్టించాడు. ఇందుకోసం అతడు ఫేస్ బుక్ నే పెళ్లిళ్ల పేరయ్యగా వాడుకున్నాడు. అందగాడైన యువకుడు.. అమ్మాయిలను మాటల్లో దింపి మూడు ముళ్లు వేసేవాడు. కానీ 12వ భార్య అప్రమత్తతో 13వ పెళ్లికి పులిస్టాఫ్ పడింది. చెన్నైకి చెందిన గణేశ్ అందగాడు. 22 ఏళ్ల వయసుంటుంది. తన గ్లామర్, హాండ్ […]
దిశ, వెబ్‌డెస్క్ : హిందు సాంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తికి ఒక్కరే భార్య ఉండడం సహజం. కానీ ఓ యువకుడు ఏకంగా 12 మందిని వివాహమాడి సంచలనం సృష్టించాడు. ఇందుకోసం అతడు ఫేస్ బుక్ నే పెళ్లిళ్ల పేరయ్యగా వాడుకున్నాడు. అందగాడైన యువకుడు.. అమ్మాయిలను మాటల్లో దింపి మూడు ముళ్లు వేసేవాడు. కానీ 12వ భార్య అప్రమత్తతో 13వ పెళ్లికి పులిస్టాఫ్ పడింది.
చెన్నైకి చెందిన గణేశ్ అందగాడు. 22 ఏళ్ల వయసుంటుంది. తన గ్లామర్, హాండ్ సమ్ ఫొటోలతో లవ్లీ గణేశ్ పేరిట ఫేస్ బుక్ లో ఖాతా తెరిచాడు. అపరిచిత యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం చేసుకునే వాడు. ఆ తర్వాత తన మాయమాటలతో అమ్మాయిలను లవ్ లో పడేసేవాడు. క్రమంగా వారిని పెళ్లి చేసుకోవడమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. ఇలా ఒకరిని, ఇద్దరినీ కాదు. ఏకంగా 12 మందిని వివాహం చేసుకున్నాడు.
గణేశ్ యథావిధిగా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పరిచయం పెంచుకున్న యువతిని పెళ్లాడతానని చెప్పాడు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు వారి వివాహాన్ని వ్యతిరేకించి, అతడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ ఇద్దరూ మేజర్లే కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో సదరు యువతి, గణేశ్ పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు.
కొత్త కాపురం సజావుగా సాగుతున్నప్పటికీ గణేశ్ ప్రవర్తన అనుమానస్పదంగా ఉండడంతో 12వ భార్యకు అనుమానం వచ్చింది. అతడి ఫోన్ ఛాటింగ్, మాటల తీరుపై ఓ కన్నెసిన భార్య.. ఫేస్ బుక్ ఛాటింగ్ చూసి ఖంగుతిన్నది. తనతోపాటు ఇలా ఫేస్ బుక్ ద్వారానే 12 మందిని పెళ్లాడినట్టు గుర్తించింది. 13వ అమ్మాయికి ఎర వేస్తున్నట్లు తెలుసుకొని పూర్తి సాక్ష్యాలతో పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు షాక్ తిన్నారు. 12 మంది యువతులను మోసం చేసిన గణేశ్ ను అరెస్ట్ చేసి, కోర్టులో రిమాండ్ చేశారు. కేసు పూర్తి దర్యాప్తు కోసం పోలీసులు కస్టడి పిటీషన్ చేశారు.