అనుమానంతో మహిళ గొంతు కోశాడు
దిశ, భువనగిరి: తనతో కాకుండా మరొకరితో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నదన్న నెపంతో ప్రియురాలిని ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన బుధవారం రాత్రి యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులో చోటు చేసుకొంది. వివరాళ్లోకి వెళితే… జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూర్ గ్రామానికి చెందిన బోలు లక్ష్మి(35) అనే మహిళ 15 ఏండ్ల క్రితం భర్త ఐలయ్య చనిపోవడంతో తన ముగ్గురి పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చి, ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో […]
దిశ, భువనగిరి: తనతో కాకుండా మరొకరితో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నదన్న నెపంతో ప్రియురాలిని ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన బుధవారం రాత్రి యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులో చోటు చేసుకొంది. వివరాళ్లోకి వెళితే… జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూర్ గ్రామానికి చెందిన బోలు లక్ష్మి(35) అనే మహిళ 15 ఏండ్ల క్రితం భర్త ఐలయ్య చనిపోవడంతో తన ముగ్గురి పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చి, ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇదే క్రమంలో క్యాబ్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆర్యకుమార్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే వీరిమధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో తరచూ గొడవల జరుగుతుండేవి.
ఈ క్రమంలో లక్ష్మి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విజయ్ అనే మరో యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన కుమార్, ఇదే అదునుగా భావించి ఎలాగైనా లక్ష్మిని అంతం చేయాలని పథకం పన్నాడు. బుధవారం లక్ష్మికి మాయ మాటలు చెప్పి, నమ్మించి వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిలో భువనగిరి బైపాస్ వద్ద ఉన్న సిద్ధ వెంచర్స్ ఫేస్-3లోని చెట్లపొదల్లోకి తీసుకొచ్చాడు. అక్కడ మళ్లీ ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేవానికి లోనైన ఆర్యకుమార్ తనతో తెచ్చుకున్న బ్లేడుతో లక్ష్మి గొంతుకోసి, తలపై బలమైన బండ రాయితో మోది దారుణంగా హత్య చేశాడు. అనంతరం చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత స్థానిక పోలీస్టేషన్‌లో లొంగిపోయాడు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న ఎస్ఐ అంజయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, కుమార్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ అంజయ్య తెలిపారు.