మూడుసార్లు బాత్రూంలోనే ప్రసవం.. కేవలం 27 సెకన్లలోనే.
దిశ, వెబ్‌డెస్క్ : మహిళకు అమ్మ అవ్వడం ఒక గొప్ప వరం. బిడ్డకు జన్మనివ్వడమంటే మహిళ మరో జన్మనెత్తడమే.. ఆ ప్రసవ వేదనలో తల్లి పడే భాధను వర్ణించడం అంతా ఇంతా కాదు. కొన్ని సార్లు ఈ నొప్పులు గంటల తరబడి ఉంటాయి. ఒక్కోసారి ఆ నొప్పులు తట్టుకోలేక కొంతమంది తల్లులు మృతిచెందిన ఘటనల గురించి కూడా వినివుంటాం. కానీ ఎప్పుడైనా తల్లికి ప్రసవ వేదన లేకుండా బిడ్డలు పుట్టడం విన్నారా..? పురుటి నొప్పులు రాకుండా కేవలం […]
దిశ, వెబ్‌డెస్క్ : మహిళకు అమ్మ అవ్వడం ఒక గొప్ప వరం. బిడ్డకు జన్మనివ్వడమంటే మహిళ మరో జన్మనెత్తడమే.. ఆ ప్రసవ వేదనలో తల్లి పడే భాధను వర్ణించడం అంతా ఇంతా కాదు. కొన్ని సార్లు ఈ నొప్పులు గంటల తరబడి ఉంటాయి. ఒక్కోసారి ఆ నొప్పులు తట్టుకోలేక కొంతమంది తల్లులు మృతిచెందిన ఘటనల గురించి కూడా వినివుంటాం. కానీ ఎప్పుడైనా తల్లికి ప్రసవ వేదన లేకుండా బిడ్డలు పుట్టడం విన్నారా..? పురుటి నొప్పులు రాకుండా కేవలం 27 సెకన్లలో బిడ్డకు జన్మనివ్వడం చూశారా ..? అయితే మీరు బ్రిటన్ కి చెందిన సోఫీ బగ్ గురుంచి తెలుసుకోవాల్సిందే. పురిటి నొప్పులు రాకుండా కేవలం 27 సెకన్ల వ్యవధిలోనే ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లిగా ఈమె పేరు రికార్డులకెక్కింది. ఆమె గురుంచి పూర్తీ వివరాలు తెలుసుకుందాం.
హాంప్‌షైర్‌లో నివసిస్తున్న సోఫీ బగ్ 38 వారాల నిండు గర్భిణి. ఇంకొన్ని రోజుల్లో డెలివరీ.. ఎప్పటిలానే తన ఇంట్లో రాత్రి బాత్ రూమ్ కి వెళ్ళింది. అక్కడే తనకు పురిటి నొప్పులు వస్తున్నట్టు అనిపించాయి. వెంటనే భర్తను పిలిచింది. భర్త వచ్చేసరికి మెట్ల మీద సోఫీ పొట్టను పుష్ చేస్తూ కనిపించింది. దీంతో భర్త క్రిస్ ఇంకొంచెం గట్టిగా పుష్ చేయమని సూచన ఇవ్వడంతో ఆమె అలాగే పుష్ ఇచ్చింది. ఆ పుష్ తో క్షణాల్లో బిడ్డ బయటికి వచ్చింది. ప్రసవ వేదన లేకుండా కేవలం అర క్షణంలోనే బిడ్డకు సోఫీ జన్మనిచ్చింది. అనంతరం వైద్యులు వచ్చి బిడ్డ బొడ్డుతాడు కట్ చేసి, తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. అయితే సోఫీ కి ఇదేం కొత్త కాదు. ఆమెకు ముగ్గురు పిల్లలు.. వారు కూడా ఇలానే బాత్ రూమ్ దగ్గర 27 సెకన్లలోనే పుట్టారు. ప్రపంచంలోనే ప్రసవ వేదన లేకుండా అతి తక్కువ క్షణాల్లో బిడ్డకు జన్మనిచ్చిన తల్లిగా సోఫీ రికార్డు సృష్టించింది.