సెల్యూట్.. 7 అవయవాలు దానం చేసిన మహిళ

దిశ, తెలంగాణ బ్యూరో: బ్రెయిన్​ డెడ్​ అయిన ఓ మహిళ(23) ఏడు అవయవాలను దానం చేసినట్లు జీవన్​దాన్​ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. నల్గొండ జిల్లా వెలిమినేడు గ్రామానికి చెందిన అశ్వీని తన పాపకు తలనీలలు సమర్పించేందుకు యాదాద్రి టెంపుల్​కు ఈనెల 2 తేదీన బైక్​ మీద బయలు దేరారు. మార్గంమధ్యలో దురదృష్టవశాత్తు అదుపు తప్పి బండి కింద పడగా, ఆమె తలకు తీవ్రగాయాలు అయ్యారు. దీంతో వెంటనే మెరుగైన వైద్యం నిమిత్తం నాంపల్లి కేర్ […]

Update: 2021-12-06 11:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బ్రెయిన్​ డెడ్​ అయిన ఓ మహిళ(23) ఏడు అవయవాలను దానం చేసినట్లు జీవన్​దాన్​ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. నల్గొండ జిల్లా వెలిమినేడు గ్రామానికి చెందిన అశ్వీని తన పాపకు తలనీలలు సమర్పించేందుకు యాదాద్రి టెంపుల్​కు ఈనెల 2 తేదీన బైక్​ మీద బయలు దేరారు. మార్గంమధ్యలో దురదృష్టవశాత్తు అదుపు తప్పి బండి కింద పడగా, ఆమె తలకు తీవ్రగాయాలు అయ్యారు. దీంతో వెంటనే మెరుగైన వైద్యం నిమిత్తం నాంపల్లి కేర్ కు ఆమెను తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యానికి ఆమె శరీరం సహకరించలేదు. దీంతో ఈనెల 5వ తేదీన మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. విషయాన్ని తెలుసుకున్న జీవన్​దాన్​ సంస్థ ఆమె కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి అవయవ దానం జరిగేలా కృషి చేశారు. కిడ్నీలు, లివర్​, లంగ్స్​, కార్నీయాస్​లను దానం చేసినట్లు జీవన్​ దాన్​ సంస్థ ప్రకటించింది.

Tags:    

Similar News