భర్త బతికుండగానే వితంతు పింఛన్
దిశ, డోర్నకల్: భర్త బతికే ఉండగా తాను వితంతువును అంటూ పింఛన్ పొందుతున్న మహిళకు అధికారులు నోటిసులు ఇచ్చారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధిలోని కొత్తతండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తతండాకు చెందిన మంగమ్మ అనే మహిళ గత కొన్నినెలలుగా వితంతు పింఛన్ తీసుకుంటోంది. దీంతో తండావాసులు భర్త బతికే ఉండగా ఆమె పింఛన్ తీసుకుంటోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో వెంకటేశ్వర్లు వెంటనే సదరు మహిళ […]
దిశ, డోర్నకల్: భర్త బతికే ఉండగా తాను వితంతువును అంటూ పింఛన్ పొందుతున్న మహిళకు అధికారులు నోటిసులు ఇచ్చారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధిలోని కొత్తతండాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కొత్తతండాకు చెందిన మంగమ్మ అనే మహిళ గత కొన్నినెలలుగా వితంతు పింఛన్ తీసుకుంటోంది. దీంతో తండావాసులు భర్త బతికే ఉండగా ఆమె పింఛన్ తీసుకుంటోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో వెంకటేశ్వర్లు వెంటనే సదరు మహిళ పింఛన్‌ను నిలిపివేశారు. అంతే కాకుండా ఇంతకాలం ప్రభుత్వాన్ని మోసం చేసి తీసుకున్న పింఛన్ డబ్బులను వెనక్కి తిరిగి ఇచ్చేయాల్సిందిగా నోటిసులిచ్చారు.