చాక్లెట్‌తో రామమందిరం.. ప్రధానికి బహూకరించాలని కోరిక
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆలయం ఎలా నిర్మించనున్నారో ఇప్పటికే నమూన చిత్రాన్ని దేశ ప్రజల ముందు ఉంచారు. అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన శిల్పబెన్ అనే భక్తురాలు రామమందిర నిర్మాణాన్ని పురస్కరించుకొని 15కిలోల చాక్లెట్‌తో ఆలయ నమూనాను రూపొందించారు. రామమందిరం మాదిరి నమూనాను అందంగా తీర్చిదిద్దారు. తయారీ కోసం రుచికరమైన చాక్లెట్‌ను ఉపయోగించామని ఆమె తెలిపారు. అయితే […]
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆలయం ఎలా నిర్మించనున్నారో ఇప్పటికే నమూన చిత్రాన్ని దేశ ప్రజల ముందు ఉంచారు. అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన శిల్పబెన్ అనే భక్తురాలు రామమందిర నిర్మాణాన్ని పురస్కరించుకొని 15కిలోల చాక్లెట్‌తో ఆలయ నమూనాను రూపొందించారు.
రామమందిరం మాదిరి నమూనాను అందంగా తీర్చిదిద్దారు. తయారీ కోసం రుచికరమైన చాక్లెట్‌ను ఉపయోగించామని ఆమె తెలిపారు. అయితే ఆలయం తయారీ కోసం ఆమె 12గంటల పాటు శ్రమించినట్టు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఈ మందిరాన్ని బహూకరించాలని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు.