అక్కడ మళ్లీ పులి కదలికలు.. జంకుతున్న జనం

దిశ, బెజ్జుర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మళ్లీ పులి కదలికలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం కాగజ్ నగర్ డివిజన్ లోని పెంచికలపేట రేంజ్ లో పులి కనిపించినట్లు ఆ ప్రాంత వాసులు తెలిపారు. పెంచికలపేట రేంజ్ లోని బొక్కి వాగు సమీపంలో శుక్రవారం సాయంత్రం పెద్దపులి కనిపంచడంతో ఏల్లూరు గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీసినట్లు వారు తెలిపారు. పులి కనిపించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బెజ్జూర్ మండలంలో మత్తడి సమీపంలో […]

Update: 2021-11-05 07:43 GMT

దిశ, బెజ్జుర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మళ్లీ పులి కదలికలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం కాగజ్ నగర్ డివిజన్ లోని పెంచికలపేట రేంజ్ లో పులి కనిపించినట్లు ఆ ప్రాంత వాసులు తెలిపారు. పెంచికలపేట రేంజ్ లోని బొక్కి వాగు సమీపంలో శుక్రవారం సాయంత్రం పెద్దపులి కనిపంచడంతో ఏల్లూరు గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీసినట్లు వారు తెలిపారు. పులి కనిపించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బెజ్జూర్ మండలంలో మత్తడి సమీపంలో ఆవులపై దాడి చేసిన పులి పెంచికలపేట మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. దీంతో బెజ్జూర్, పెంచికలపేట మండలాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతాల్లోకి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అటవీ అధికారులు స్పందించి పులి భయం నుండి తమను రక్షించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News