భలే దొంగ.. మాటల్లో పెట్టి లక్షల్లో దోపిడి..
దిశ, హుస్నాబాద్: కిరాణా షాపులో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ తెలిపారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామంలోని బోయిని కనకతార, లక్ష్మిప్రసన్న అనే కిరాణం కొట్టు నడుపుతోంది. అక్టోబర్ 10వ తేదీ ఉదయం 10 గంటలకు మోటార్ సైకిల్ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి మాస్కు, తలకు క్యాపు ధరించి షాపులో కొన్ని సరుకులు కొని తర్వాత యజమాని […]
దిశ, హుస్నాబాద్: కిరాణా షాపులో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ తెలిపారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామంలోని బోయిని కనకతార, లక్ష్మిప్రసన్న అనే కిరాణం కొట్టు నడుపుతోంది. అక్టోబర్ 10వ తేదీ ఉదయం 10 గంటలకు మోటార్ సైకిల్ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి మాస్కు, తలకు క్యాపు ధరించి షాపులో కొన్ని సరుకులు కొని తర్వాత యజమాని దృష్టి మరల్చి షాపులో పెట్టిన రూ.10.75000 లక్షల నగదును అపహరించాడన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశామన్నారు. అందులో భాగంగా నిందితుడు వరంగల్ జిల్లా చింతల్ గ్రామానికి చెందిన సయ్యద్ యాకూబ్ మోహినుద్దీన్ ఖాద్రి గా గుర్తించామన్నారు. ఇతనిపై గతంలో పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి కేసు ఒకటి నమోదు అయ్యిందన్నారు. అక్కడ కూడా యజమాని దృష్టి మళ్లించి రూ.30వేల దొంగిలించిన కేసులో నిందితుడన్నారు.
ఇతడు నిత్యం తన మోటార్ సైకిల్ పై వరంగల్ తొర్రూర్, జనగామ, నర్సంపేట, పరకాల, రామగుండం, సిద్దిపేట వంటి ప్రాంతాల్లో తిరుగుతూ రూ.2000 కిరాణా షాపు యజమానులకిచ్చి కొన్ని సరుకులు తీసుకుని, మిగతా డబ్బులు ఇచ్చిన తర్వాత అందులో రూ. 500 తక్కువచ్చాయని వాగ్వాదానికి దిగుతాడన్నారు. ఇదే క్రమంలో షాపుయజమాని దృష్టి మళ్లించి షాపులోని డబ్బును దొంగిలించడం ఇతడికి వెన్నతో పెట్టిన విద్యన్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసేందుకు సహకరించిన సీఐ రఘు, ఎస్సై శ్రీధర్, కానిస్టేబుళ్లు రవి, సతీష్, చంద్రశేఖర్లను అభినందించారు. కిరణావర్తక, వాణిజ్య సముదాయాలు నడుపుతున్న యజమానులు ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారానే నేరాలు అదుపు చేయవచ్చన్నారు.