మహా ఘోరం.. ఆ పని చేశారని కుటుంబానికి విషమిచ్చి చంపిన 17ఏళ్ల యువతి

దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులకు బిడ్డలే ప్రాణం.. ఇంట్లో  ఎన్ని కష్టాలు ఉన్నా వారికి ఏ లోటు రాకుండా పెంచడానికే చూస్తారు. ఒకరిని తక్కువ.. ఒకరిని ఎక్కువ చూసే పేరెంట్స్ ఉండరు. కానీ, కొన్నికొన్నిసార్లు తల్లిదండ్రులు చూపించే చిన్న వివక్షే వారిలో ఎంతో పగను రేకెత్తిస్తాయి. తనకన్న ముందు పుట్టినవారినో, వెనక పుట్టిన వారినో ఎక్కువగా చూసి, మిగతావారిని పట్టించుకోకపోతే వారిలో ఆత్మన్యూనతా భావం ఎక్కువ అవుతుంది. దానివల్ల వారు ఎలాంటి దారుణానికైనా పాల్పడతారు. తాజాగా ఒక 17 […]

Update: 2021-10-20 00:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులకు బిడ్డలే ప్రాణం.. ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా వారికి ఏ లోటు రాకుండా పెంచడానికే చూస్తారు. ఒకరిని తక్కువ.. ఒకరిని ఎక్కువ చూసే పేరెంట్స్ ఉండరు. కానీ, కొన్నికొన్నిసార్లు తల్లిదండ్రులు చూపించే చిన్న వివక్షే వారిలో ఎంతో పగను రేకెత్తిస్తాయి. తనకన్న ముందు పుట్టినవారినో, వెనక పుట్టిన వారినో ఎక్కువగా చూసి, మిగతావారిని పట్టించుకోకపోతే వారిలో ఆత్మన్యూనతా భావం ఎక్కువ అవుతుంది. దానివల్ల వారు ఎలాంటి దారుణానికైనా పాల్పడతారు. తాజాగా ఒక 17 ఏళ్ల యువతి కుటుంబం తనను పట్టించుకోవడం లేదని వారికి విషం పెట్టి హాతమార్చిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. ఇసముద్ర గ్రామంలో ఒక 17 ఏళ్ల యువతి కుటుంబం నివసిస్తోంది. అమ్మ, నాన్న, బామ్మ, అక్క, అన్న ఉన్న ఆ కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తోంది. ఇక ఈ కుటుంబంలో 17 ఏళ్ల యువతి మాత్రం చిన్నప్పటినుంచి నానమ్మ, తాతయ్య ఇంట్లోనే పెరిగింది. దీంతో ఆమె కుటుంబంపై కక్ష పెంచుకొంది. తనను ఎవరు పట్టించుకోవడంలేదని బాధపడేది. ఈ నేపథ్యంలోనే బాలిక మూడేళ్ల క్రితం నుంచే అమ్మ, నాన్నలతో కలిసి ఉంటుంది. కాగా, తన తోబుట్టువులతో పాటుగా కుటుంబసభ్యులు తనకు సమాదరణ కల్పించడం లేదని ఆవేదన చెందింది. దీంతో కుటుంబాన్ని హతమార్చాలని ప్లాన్ వేసింది. ఎప్పటిలాగేనా కుటుంబమంతా సాయంత్రం రాగి ముద్దలు తింటారని తెలిసిన ఆమె అందులో ఇన్‌సెక్టిసైడ్ అనే విష పదార్ధాన్ని కలిపింది.

రాగి ముద్దలలో విషం ఉందని తెలియని కుటుంబమంతా వాటిని తిన్నారు. అనంతరం వాంతులు అయ్యి అస్వస్థతకు గురయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అందరు మృతిచెందారు. 19 ఏళ్ల అన్న మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆహరం విషం కలవడం వలనే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని ప్రశ్నించగా.. తానే తన కుటుంబాన్ని హతమార్చినట్లు అంగీకరించడంతో ఆమెను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News