గోడ కూలి యువకుడి మృతి
– రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జీహెచ్ఎంసీ దిశ, న్యూస్ బ్యూరో: నగరంలో ఈ రోజు (ఆదివారం) రాత్రి వీచిన గాలిదుమారం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. గోషామహల్ సర్కిల్ మంగళహాట్ వార్డులో ఈదురుగాలులకు ప్రహరీ గోడ కూలి పక్కనున్న షెడ్‌పై పడిపోయింది. షెడ్ కూడా కూలిపోవడంతో అందులో ఉన్న ఇందర్ సింగ్ (19) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో షెడ్‌లోనే ఉన్న ఇందర్ సింగ్ తల్లి దయాబాయికి కాలు విరిగింది. అధికారులు ఆమెను ఉస్మానియా […]
– రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జీహెచ్ఎంసీ
దిశ, న్యూస్ బ్యూరో: నగరంలో ఈ రోజు (ఆదివారం) రాత్రి వీచిన గాలిదుమారం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. గోషామహల్ సర్కిల్ మంగళహాట్ వార్డులో ఈదురుగాలులకు ప్రహరీ గోడ కూలి పక్కనున్న షెడ్‌పై పడిపోయింది. షెడ్ కూడా కూలిపోవడంతో అందులో ఉన్న ఇందర్ సింగ్ (19) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో షెడ్‌లోనే ఉన్న ఇందర్ సింగ్ తల్లి దయాబాయికి కాలు విరిగింది. అధికారులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, మృతుని కుటుంబానికి బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్ రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.
Tags : GHMC, Goshamahal, wall collapsed, Teenager died