జాతీయ టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికైన రమ్య
దిశ,నర్సాపూర్; జాతీయ టార్గెట్ బాల్ పోటీలకు నర్సాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని రమ్య ఎంపికైంది. సెప్టెంబర్ 12న హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్‌లో రాష్ర్టస్థాయి పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. 8వ సీనియర్ జాతీయ స్థాయి టార్గెట్ బాల్ పోటీలు ఈ నెల 20 నుంచి 23 వరకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్టంలో జరిగే పోటీలలో రమ్య పాల్గొననున్నట్లు జిల్లా కార్యదర్శి తరుణ్ రాజ్, కోచ్ శేఖర్‌లు తెలిపారు.